Telugu Movies This week: ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు ఇవే.. మనమే, సత్యభామతో పాటు..

Best Web Hosting Provider In India 2024

Telugu Movies This week: టాలీవుడ్‍లో సినిమాల రిలీజ్‍ల జోరు మళ్లీ పెరిగింది. ఎన్నికలు, ఐపీఎల్‍ వల్ల వాయిదా పడిన తెలుగు చిత్రాలు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గతవారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయివేగం, గంగం గణేశా చిత్రాలు విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ జూన్ తొలి వారం నాలుగు తెలుగు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. ఇందులో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఉన్నాయి. ఓ తమిళ డబ్బింగ్ చిత్రం కూడా వచేస్తోంది. ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఇవే.

మనమే

శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘మనమే’ చిత్రం ఈ వారంలోనే జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత శర్వా మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ రిలేషన్‍షిప్ డ్రామాగా ఈ మూవీ ఉండనుంది. మనమే ట్రైలర్, ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. హేషబ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సత్యభామ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించిన సత్యభామ సినిమా కూడా ఈ శుక్రవారం జూన్ 7వ తేదీన రిలీజ్ కానుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటించారు. కాజల్ ఈ లేడీ ఓరియెండ్ మూవీ చేయటంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. సత్యభామ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

రక్షణ

హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ మెయిన్ రోల్ చేసిన రక్షణ చిత్రం కూడా జూన్ 7వ తేదీన విడుదలవుతోంది. పాయల్‍కు, ఈ మూవీ దర్శకుడు ప్రదీప్ ఠాకూర్‌ మధ్య ఇటీవలే వివాదం రేగింది. అయితే, ఎట్టకేలకు రక్షణ చిత్రం రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌ రోల్ చేశారు పాయల్. నాలుగేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న రక్షణ ఇప్పుడు విడుదల అవుతోంది. దర్శకుడు ప్రతీప్ ఠాకూర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు.

లవ్ మౌళి

నవదీప్ హీరోగా నటించిన రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా ‘లవ్ మౌళి’ చిత్రం కూడా జూన్ 7నే ప్రేక్షకుల ముందుకు రానుంది. బోల్డ్ కంటెంట్‍తో ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌తోనే అర్థమైంది. ఈ మూవీకి అవనీంద్ర దర్శకత్వం వహించారు. నవదీప్ సరసన పంఖురి గిద్వానీ హీరోయిన్‍గా నటించారు. లవ్ మౌళి సినిమాకు గోవింద్ వసంత మ్యూజిక్ ఇచ్చారు. లవ్ మౌళి మూవీ కూడా చాలా వాయిదాల తర్వాత ఇప్పుడు జూన్ 7న రిలీజ్ అవుతోంది.

డబ్బింగ్‍లో ‘వెపన్’

తమిళ సినిమా వెపన్ జూన్ 7వ తేదీన రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్‍లోనూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో వసంత్ రవి, సత్యరాజ్, తాన్యా హోప్ ప్రధాన పాత్రలు పోషించారు. గుహన్ సెన్నియపన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో వెపన్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024