Best Web Hosting Provider In India 2024
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అసలు మాయ కోసం ఇదివరకు వెళ్లిన అడ్రస్‌కు వెళ్తారు అప్పు అండ్ కావ్య. కళావతినే ఫాలో అవుకుంటూ వెళ్తుంది రుద్రాణి. అప్పు డోర్ కొడుతుంది. అప్పు డోర్ కొట్టగానే ఇదివరకు తనతో మాట్లాడిన మాయ ఫ్రెండ్ సాహితి డోర్ తీస్తుంది.
కంగారుపడిన అసలు మాయ
అనంతరం మాయ ఎక్కడ, వచ్చిందా అని అప్పు అడుగుతుంది. మాయను పిలుస్తావా అని అప్పు అంటుంది. దానికి బిత్తరపోయి సైలెంట్‌గా ఉంటుంది సాహితి. అప్పుడు వెనుక నుంచి అసలు మాయ లగేజ్ పట్టుకుని వస్తుంది. అదంతా రుద్రాణి చాటుగా ఉండి చూస్తుంటుంది. అప్పు, కావ్యను చూసి షాక్ అవుతుంది మాయ. తను కంగారుపడిన విషయం కావ్య, అప్పుకు అర్థం అవుతుంది. తాము ఎవరో మాయకు తెలుసని అర్థం చేసుకుంటారు.
ప్రశ్నించిన కావ్య
మర్యాదగా నేను అడిగినవాటికి జవాబు చెప్పు. ఇప్పటివరకు ఏమేం చేశావో ఆ నిజాలు చెప్పు అని కావ్య ప్రశ్నిస్తుంది. కావ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లగేజ్ అక్కడే పడేసి పారిపోతుంది మాయ. మాయ వెంటే అప్పు కావ్య పరుగెడుతుంటారు. అదంతా రుద్రాణి చూస్తూ ఉంటుంది. మాయ రోడ్డుపై పరుగెడుతుంటుంది. మాయ వెనుకే అప్పు, కావ్య పరుగెడుతుంటూ పిలుస్తుంటారు. కానీ, మాయ ఆగదు.
కారుతో గుద్దేసిన రుద్రాణి
పరుగెడుతున్న మాయను కారులో వచ్చి యాక్సిడెంట్ చేస్తుంది రుద్రాణి. యాక్సిడెంట్ చేసి వెళ్లిపోతుంది రుద్రాణి. మాయ ఓ మూలకు ఎగిరిపడుతుంది. మాయ చనిపోయిందా లేదా అని కారు ఆపి వెనక్కి తిరిగి చూస్తుంది రుద్రాణి. మాయను లేవమని, ఏమైందని చెంపైపై కొడుతూ మాయను స్పృహలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు కావ్య, అప్పు. అది చూసి రుద్రాణి తను అనుకున్న పని అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని వెళ్తుంది.
హాస్పిటల్‌లో అసలు మాయ
అయితే.. మాయ చనిపోతుంది. లేదా మాయను హాస్పిటల్‌లో కావ్య, అప్పు జాయిన్ చేస్తారని తెలుస్తోంది. అయితే అక్కడ మాయ నిజం చెబుతుందని అర్థం అవుతోంది. కానీ, దానికి టైమ్ పడుతుందని తెలుస్తోంది. మరోవైపు రాజ్‌కు దొంగ మాయ చిత్రతో పెళ్లికి రెండు రోజుల గడువు పూర్తి అయి వివాహం జరిపిస్తుంది అపర్ణ. ఆ పెళ్లి జరిపించే సమయంలోనే అసలు మాయ రాజ్ తీసుకొచ్చిన బిడ్డ గురించి నిజం చెప్పే అవకాశం ఉంది.
ఎప్పటిలాగే రుద్రాణి
రాజ్ తీసుకొచ్చిన బాబు సుభాష్ కొడుకు కాదని, డబ్బు కోసమే తను ఇలా చీట్ చేసినట్లు చెప్పే అవకాశం ఉంది. లేదా సీరియల్‌లో ఇంకా ఏమైనా ట్విస్ట్స్ జరుగుతాయో చూడాలి. అలాగే మాయను రుద్రాణి కారుతో యాక్సిడెంట్ చేసి మర్డర్ చేయడం కావ్య కానీ, అప్పు గానీ చూశారా లేదా అనేది మరింత క్యూరియాసిటీ కలిగించే అంశం. ఒకవేళ చూసుంటే రుద్రాణిని పట్టించేందుకు ఓ అవకాశం దొరికినట్లే. లేదంటే మళ్లీ ఎప్పటిలాగే ఇంట్లో ఉండి రుద్రాణి కన్నింగ్ ప్లాన్స్ వేస్తూ ఉంటుంది.
చిత్రతో రాజ్ పెళ్లి
బ్రహ్మముడి సోమవారం నాటి ఎపిసోడ్‌లో రాజ్‌తో చిత్ర (దొంగ మాయ) పెళ్లికి ముహుర్తాలు పెడుతుంది అపర్ణ. ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంది. దాంతో కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్. నీవల్లే ఇదంతా అని తిడతాడు. తర్వాత కావ్యకు అప్పు కాల్ చేయడం, నిజమైన మాయ గురించి మాట్లాడుకోవడం రుద్రాణి వింటుంది. అమ్మ కావ్య నీ బుర్ర మాములు బుర్ర కాదు. నిన్ను తక్కువ అంచనా వేశాను. కానీ, ఈ విషయం నాకు తెలియకుండా జాగ్రత్తపడాల్సింది అని రుద్రాణి అనుకుంటుంది.