Best Web Hosting Provider In India 2024
Yevam Release Date Announced: రొటిన్‌కు భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో ఉన్నాం అంటున్నారు దర్శకుడు ప్రకాష్ దంతులూరి
ప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యేవమ్’. గామి హీరోయిన్ చాందిని చైదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్, బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి ఆషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఇటీవల ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్.
జూన్ 14న ఈ యేవమ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “మహిళా సాధికారికతను చాటి చెప్పే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ఎంతో మినింగ్‌ఫుల్‌గా, కొత్తగా ఉంటుంది” అని డైరెక్టర్ ప్రకాష్ దంతులూరు చెప్పారు.
“ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఒక మార్క్ ఉంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్ నేరేషన్‌తో ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని యేవమ్ మూవీ డైరెక్టర్ ప్రకాష్ దంతులూరు పేర్కొన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, ఆషు రెడ్డితోపాటు గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా ఎస్‌వీ విశ్వేశ్వర్, సంగీతం కీర్తన శేషు, నీలేష్ మందలపు అందిస్తున్నారు.
సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన చాందినీ చౌదరి కలర్ ఫొటో, సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, కుందనపు బొమ్మ, సూపర్ ఓవర్, బొంబాట్, కేటుగాడు వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.
అలాగే సభా నాయగన్ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఆకట్టుకుంది చాందినీ చౌదరి. ఇటీవలే విశ్వక్ సేన్ గామి సినిమాలో డాక్టర్ పాత్రలో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న గామి చిత్రంలో వింత సమస్యతో బాధపడుతున్న అఘోరా శంకర్ (విశ్వక్ సేన్)కు సహాయం అందించే డాక్టర్ జాహ్నవి పాత్రలో చాందినీ చౌదరి బాగా ఫర్ఫామ్ చేసింది.
అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలతో గామి తెరకెక్కింది.