Best Web Hosting Provider In India 2024
Celebrity Astrologer Venu Swamy Decision: తెలుగు పాపులర్ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా పాపులర్ అయ్యారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి, సినిమాల హిట్స్, ప్లాఫ్స్ ఫలితాల నుంచి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్ సభ ఎన్నికల రిజల్ట్స్ వరకు ఆయన జోస్యం చెప్పారు.
తారుమారైన పరిస్థితి
ఏపీ సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డినే వస్తారని వేణు స్వామి జాతకం చెప్పారు. దానికి సంబంధించిన వీడియో చాలా వైరల్ అయింది. కానీ, తీరా ఎలక్షన్స్ రిజల్ట్స్ వేల పరిస్థితి తారుమారు అయింది. ఏపీలో వైఎస్సార్‌సీపీ పార్టీ వెనుకంజలో ఉంది. టీడీపీ, పవన్ కల్యాణ్ కూటమి ముందంజలో కొనసాగుతోంది.
డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్
దాంతో ఈసారి ఏపీ సీఎమ్ నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన జాతకం కూడా టాపిక్‌గా మారింది. నీ జ్యోతిష్యం ఏమైంది అంటూ నెట్టింట్లో వేణు స్వామిని ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఈ ట్రోలింగ్‌పై స్పందించిన వేణు స్వామి ఓ నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చారు.
జాతకాలు చెప్పను
ఇక నుంచి జాతకాలు చెప్పనని వేణు స్వామి తెలిపారు. “ఓం నమో వెంకటేశాయా.. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. నేను నరేంద్ర మోది ప్రభావం తగ్గుతుందని, అలాగే ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నేను చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్యను అనుసరించి అలా చెప్పడం జరిగింది” అని వేణు స్వామి తెలిపారు.
ఒకటి నిజమైంది
నేను చెప్పినదాంట్లో సెంటర్‌లో మోడీ ప్రభావం తగ్గింది. అది ఒకటి నిజమైంది. ఆంధ్రప్రదేశ్‍లో జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారని నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పింది. నేను సాధారణంగా జాతకాన్ని బేస్ చేసుకునే చెప్పడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి నన్ను విమర్శిస్తున్నవారు.. ట్రోల్ చేస్తున్నవారు.. నన్ను లక్ష్యంగా చేసుకున్నారు” అని వేణు స్వామి అన్నారు.
వంద శాతం తప్పు
“సో ఈరోజు నేను చెప్పిన జాతకం వంద శాతం తప్పు అయింది. దానిని నేను కచ్చితంగా ఒప్పుకుంటున్నాను. జగన్ మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పిన జాతకం తప్పు అవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈరోజు నుండి ఎలాంటి రాజకీయపరమైన విశ్లేషణలు గానీ, ప్రిడిక్షన్స్ గానీ చెప్పను” అని జ్యోతిష్యుడు వేణు స్వామి తెగేసి చెప్పారు.
నేను ఫెయిల్ అయ్యాను
“అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీల వ్యక్తిగత ప్రిడిక్షన్స్ గానీ ఇక నుండి ఎలాంటి సోషల్ మీడియా వేదికలలో చెప్పడం మానేస్తాను. నేను ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల జగన్ మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేంచిడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని నేను విశ్లేంచిడంలో ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలు నేను విశ్లేషించను” అని వేణు స్వామి షాక్ ఇచ్చారు.
వీడియో వైరల్
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఓటమిని ఒప్పుకున్నందుకు వేణు స్వామి పట్ల పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మీరు జాతకాలు చెప్పకుండే ఎంటర్టైన్‌మెంట్, మీమ్స్ ట్రోలింగ్ ఎలా అని నెటిజన్స్ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు.