Kalki 2898 AD Update: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి అప్‍డేట్‍కు టైమ్ ఖరారు

Best Web Hosting Provider In India 2024

Kalki 2898 AD Update: కల్కి 2898 ఏడీ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ యాక్షన్ మూవీపై అంచనాలు భారీ రేంజ్‍లో ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. రిలీజ్ సమీపిస్తున్న తరుణంలో కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్, పాటల కోసం ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో ఓ అప్‍డేట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అయింది.

అప్‍డేట్ ఎప్పుడంటే..

కల్కి 2898 ఏడీ సినిమా నుంచి రేపు (జూన్ 5) ఉదయం 10 గంటలకు రానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ అప్‍డేట్ దేని గురించో మాత్రం వెల్లడించలేదు. రేపు ఉదయం 10 గంటలకు వెల్లడి కానుంది.

ట్రైలర్ గురించా.. పాటనా?

కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఈవారంలోనే వచ్చేస్తోందంటూ కొన్నిరోజులుగా రూమర్లు వస్తున్నాయి. రిలీజ్ సమీపిస్తుండటంతో ట్రైలర్ కోసం అందరూ క్యూరియాసిటీతో ఉన్నారు. అలాగే, కల్కి నుంచి పాట కూడా రానుందంటూ బజ్ ఉంది. మరి, రేపు ఉదయం 10 గంటలకు ట్రైలర్ రిలీజ్ గురించి అప్‍డేట్ వస్తుందా.. సాంగ్‍ గురించి మూవీ టీమ్ వెల్లడిస్తుందా అనేది చూడాలి. ట్రైలర్ గురించేనని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమాలో భైరవ పాత్ర చేశారు ప్రభాస్. విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి ఆధారంగా ఈ పాత్ర ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. భారత పురాణాల ఆధారంగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో అశ్వత్థామగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నటించారు. లోక నాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి కీలకపాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో స్పెషల్ ఫ్యుచరస్టిక్ కారు ‘బుజ్జి’ హైలైట్‍గా నిలుస్తోంది. ఇప్పటికే భైరవబుజ్జి పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఓ యానిమేషన్ సిరీస్ కూడా అందుబాటులోకి తెచ్చింది మూవీ టీమ్. ఈ సిరీస్‍కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో బుజ్జి కారు బ్రైన్‍కు స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ముంబైలో ఈవెంట్

కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్‍ను ముంబైలో భారీగా నిర్వహించాలని మూవీ టీమ్ నిర్ణయించింది. ట్రైలర్ కూడా ఇదే ఈవెంట్‍లో లాంచ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అప్‍డేట్ రావాల్సి ఉంది.

కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పటి వరకు భారతీయ సినీ ఇండస్ట్రీలో ఖరీదైన చిత్రంగా వస్తోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. సుమారు రూ.600కోట్ల బడ్జెట్‍తో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. ఈ మూవీ చూసే ప్రేక్షకులకు వేరే లోకంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందని తాను నమ్ముతున్నానని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవల చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024