Best Web Hosting Provider In India 2024
Aranmanai 4 OTT streaming Date: హారర్ కామెడీ మూవీ ‘అరణ్మనై 4’ మంచి విజయం సాధించింది. తెలుగులో ‘బాక్’ (Baak) పేరుతో ఈ మూవీ వచ్చింది.మే 3వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ అయింది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో తమిళ నటుడు సుందర్.సి, హీరోయిన్లు తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు చేశారు. ఈ హారర్ మూవీకి సుందరే దర్శకత్వం కూడా వహించారు. సూపర్ హిట్ అయిన ‘అరణ్మనై 4’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.
స్ట్రీమింగ్ డేట్
అరణ్మనై 4 చిత్రం జూన్ 21వ తేదీన డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని హాట్స్టార్ అధికారికంగా వెల్లడించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ డేట్ను వెల్లడించింది.
జూన్ 21న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ అరణ్మనై 4 హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. నాలుగు భాషల్లో అందుబాటులోకి వస్తుందని క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల త్వరలో అంటూ అప్డేట్ ఇచ్చిన ఆ ప్లాట్ఫామ్ ఇప్పుడు.. జూన్ 21 స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.
మిక్స్డ్ టాక్ వచ్చినా సూపర్ హిట్
అరణ్మనై 4 సినిమా మే 3న రిలీజ్ కాగా ముందుగా మిశ్రమ స్పందన వచ్చింది. అయినా తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొదటి నుంచే దూకుడు చూపింది. భారీగా వసూళ్లను దక్కించుకుంది. మొత్తంగా సుమారు రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్ అయింది. తెలుగులో ‘బాక్’ పేరుతో వచ్చినా పెద్దగా వసూళ్లు రాబట్టలేదు.
తమన్నా, రాశీ ఖన్నా ఉండటంతో అరణ్మనై 4 చిత్రానికి మొదటి నుంచి బాగా హైప్ వచ్చింది. ఈ ఇద్దరూ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ప్రధాన పాత్ర చేసిన సుందర్ దర్శకత్వం కూడా చేశారు. రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగిబాబు, వీటీవీ గణేశ్, జయప్రకాశ్ ఈ మూవీలో కీరోల్స్ చేశారు. ఈ మూవీకి హిప్హాప్ తమిళ మ్యూజిక్ ఇచ్చారు.
తమిళ హారర్ ఫ్రాంచైజీ అరణ్మనైలో నాలుగో మూవీగా ఇది వచ్చింది. అరణ్మనై 4 ఔట్ డేటెడ్ కథ, కథనంతో ఉన్నాయనే టాక్ కూడా వచ్చింది. అయితే, మొత్తంగా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ దుమ్మురేపింది. అన్వి సినీమ్యాక్స్, బెంజ్ మీడియా పతాకాలపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు.
ఆడుజీవితంపై నో అప్డేట్
మలయాళ సర్వైవల్ డ్రామా ‘ఆడుజీవితం – ది గోట్లైఫ్’ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్స్టార్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. పృథ్విరాజ్ కుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ థియేటర్లలో మార్చి 28వ తేదీన రిలీజ్ అయింది. రెండు నెలలు దాటినా ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు రాలేదు. హాట్స్టార్ కూడా ఆడుజీవితం మూవీపై ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్కు వస్తుందో చూడాలి.