Best Web Hosting Provider In India 2024
Kalki OTT Release: టోవినో థామస్ హీరోగా నటించిన కల్కి మూవీ మలయాళంలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోకి వచ్చేసింది. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో కల్కి స్ట్రీమింగ్ అవుతోంది.
సంయుక్త మీనన్ హీరోయిన్…
కల్కి మూవీలో టోవినో థామస్‌కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో శివజీవ్ పద్మనాభన్, విని విశ్వలాల్ కీలక పాత్రలు పోషించారు. కల్కి సినిమాకు ప్రవీన్ ప్రభరాం దర్శకత్వం వహించాడు. 2019లో మలయాళంలో ఈ మూవీ రిలీజైంది. పోలీస్ క్యారెక్టర్‌లో టోవినో థామస్ యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటూ ప్రశంసలు వినిపించాయి.
కల్కి కథ ఇదే…
తమిళనాడు, కేరళ బోర్డర్‌లో ఉన్న నాన్‌చెన్‌కోట్టా అనే ఏరియాను అమర్‌నాథ్ అనే రౌడీ ఏలుతుంటాడు. తన రాజకీయబలంతో పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు. అమరనాథ్ దౌర్జన్యాలను ఎదురించలేక ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటాడు.
ఆ ఊరికి కొత్తగా కల్కి ఎస్ఐగా వస్తాడు. భయానికి మీనింగ్ తెలియని కల్కి అమరనాథ్‌ను ఎలా ఎదురించాడు? అతడి ఆగడాలకు ఏ విధంగా చెక్ పెట్టాడు? డాక్టర్ సంగీత కల్కికి ఎలా అండగా నిలిచింది అన్నదే కల్కి మూవీ కథ.కల్కి మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు. కల్కి మలయాళ వెర్షన్ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
అన్వేషిప్పన్ కండేతుమ్…
టోవినో థామస్‌కు పోలీస్ ఆఫీసర్ రోల్స్ చక్కగా కలిసొచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన అన్వేషిప్పిమ్ కండేతుమ్‌లో టోవినో థామస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో భారీగా వసూళ్లను రాబట్టింది. కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
మైత్రీ మూవీ మేకర్స్…
అన్వేషిప్పిన్ కండేతుమ్ తర్వాత నడికర్ పేరుతో ఓ కామెడీ డ్రామా మూవీని చేశాడు టోవినో థామస్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాతోనే మలయాళ చిత్ర నిర్మాణంలోకి మైత్రీ మూవీ మేకర్స్ ఎంట్రీ ఇచ్చింది. దివ్య పిళ్లై, సౌబీన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పద కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు 30 కోట్లకుపై నష్టాలను మిగిల్చింది.
ఆరు సినిమాలతో బిజీ
రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథ, పాత్రల పరంగా ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తోన్నాడు టోవినో థామస్. నెక్స్ట్ మూవీ ఏఆర్ఎమ్‌లో ట్రిపుల్ రోల్ చేస్తోన్నాడు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీలో కృతిశెట్టి, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. మోహన్‌లాల్ లూసిఫర్ 2లో టోవినో థామస్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. టోవినో థామస్ త్రిష కాంబినేషన్‌లో ఐడెంటీటీ పేరుతో ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూడు సినిమాలతో పాటు మరో మలయాళంలో మరో మూడు సినిమాలకు టోవినో థామస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.