Best Web Hosting Provider In India 2024
AP New CS Neerab Kumar: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను ఎంపిక చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తర్వాత సొంత జట్టు ఎంపిక కోసం కసరత్తు చేసిన చంద్రబాబు నీరభ్ కుమార్ ప్రసాద్ వైపు మొగ్గు చూపారు. సిఎస్ రేసులో ఆర్పీ సిసోడియా, విజయానంద్ పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరకు నీరభ్‌కుమార్‌ను అదృష్టం వరించింది. నీరభ్ కుమార్ ప్రసాద్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జిఏడి పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ శుక్రవారం జీవో నంబర్ 1034 జీవో జారీ చేశారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నీరభ్‌కుమార్ ప్రసాద్ బుధవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అదే రోజు సిఎస్ జవహర్ రెడ్డి సైతం మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. జవహర్ రెడ్డిని కొనసాగించే ఉద్దేశం లేదని స్పష్టం కావడంతో బుధవారం ఆయన జిఏడి కార్యదర్శికి సెలవుపై వెళుతున్నట్టు లేఖను పంపారు. దీంతో కొత్త సిఎస్ ఎంపికకు మార్గం సుగమం అయ్యింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
కొత్త సీఎస్‌గా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరకు నీరభ్ వైపే మొగ్గు చూపారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఎస్‌గా ఆయన నియామకంపై శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత సీఎస్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. జవహర్ రెడ్డి జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. సీఎంఓ అధికారుల కూర్పుపై కసరత్తు కూడా మొదలైంది. సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ముద్దాడ రవిచంద్ర చూడనున్నారు. మరో ఇద్దరు, ముగ్గురు అధికారులను కూడా సిఎంఓలో నియమించే అవకాశాలు ఉన్నాయి.
టాపిక్