Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: ఇవాళ గణతంత్ర దినోత్సవం. ఇవాళ ఎవరు ఏం మాట్లాడినా హుందాగా, సంప్రదాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విలువలు, సంప్రదాయం తెలిసిన వారెవరైనా అదే విధంగా మాట్లాడతారు కానీ.. ఈరోజు ఒక సెలబ్రిటీ పార్టీ నాయకుడు.. పవన్‌కళ్యాణ్ మాట్లాడినట్లు ఏ ఒక్కరూ మాట్లాడరు. ప్రజాసేవ క్షేత్రంలోకి వచ్చినప్పుడు అందరికీ నచ్చేట్లు.. అందరూ మెచ్చుకునేట్లు మాట్లాడాలన్నారు. ఇవాళ గణతంత్ర దినోత్సవం అన్న విషయం కూడా మర్చిపోయిన ఆ సెలబ్రిటీ పార్టీ నాయకుడు పిచ్చెక్కినట్లు మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఇన్నాళ్ల మా రాజకీయ జీవితంలో ఇంత సిగ్గు మాలిన సన్నాసి రాజకీయ నాయకుడ్ని చూస్తామనుకోలేదు. స్వాతంత్య్ర ఉద్యమ వీరుల్ని గుర్తు చేసుకోవాల్సిన ఇవాళ ఆ సన్నాసి మాటలు వినడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మేము మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం.