
Best Web Hosting Provider In India 2024

Chicken keema Curry: చికెన్ కీమా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది మటన్ కీమాను మాత్రమే తింటూ ఉంటారు. చికెన్ కీమాను తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. ఎప్పుడూ ఒకేలా కాకుండా చికెన్ కీమాను కాస్త కొత్తగా సెనగపప్పుతో కలిసి వండారంటే రుచి అదిరిపోతుంది. శనగపప్పు కూర కూడా రుచిగానే ఉంటుంది. అలాంటిది చికెన్ కీమాను శెనగపప్పుతో కలిపి వండితే డబుల్ టేస్ట్ రావడం ఖాయం. కేవలం అన్నంలోకే కాదు చపాతీలో తిన్నా ఇది టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని వండుకొని చూడండి. మీ ఇంటిల్లిపాదికే నచ్చడం మాత్రం ఖాయం.
చికెన్ కీమా కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ కీమా – అరకిలో
శెనగపప్పు – 100 గ్రాములు
పచ్చిమిర్చి – మూడు
పసుపు – అర స్పూను
ఉల్లిపాయ – ఒకటి
నూనె – తగినంత
కారం – రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
జీలకర్ర పొడి – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – ఒక స్పూను
పుదీనా తరుగు – మూడు స్పూన్లు
లవంగాలు – నాలుగు
మిరియాలు – నాలుగు
చికెన్ కీమా రెసిపీ
1. చికెన్ కీమా, సెనగపప్పు కలిపి వండే ఈ కర్రీ కోసం శనగపప్పును రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి. లేదా కుక్కర్లో డబ్బై శాతం ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. నూనె వేడెక్కాక లవంగాలు, మిరియాలు వేసి వేయించుకోవాలి.
4. వాటి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి.
5. వాటి రంగు మారే వరకు ఉంచాలి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శెనగపప్పును తీసి అందులో వేయాలి.
6. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
7. ఆ తర్వాత మూత తీసి ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
8. ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
9. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్లీ బాగా కలిపి మూత పెట్టాలి.
10. ఒక పది నిమిషాలు అలా ఉడికించాక మూత తీసి నీళ్లు వేయాలి.
11. ఓ రెండు నిమిషాలు ఉడికించుకున్నాక చికెన్ కీమాను వేసి బాగా కలుపుకోవాలి.
12. మూత పెట్టి చిన్న మంట మీద అరగంట పాటు ఉడికించాలి.
13. చికెన్ కీమా ఉడకడానికి అరగంట సమయం సరిపోతుంది.
14. ఇప్పుడు కొత్తిమీర తరుగును, పుదీనా తరుగును చల్లుకొని బాగా కలిపి మూత పెట్టాలి. ఐదు నిమిషాలు అలా ఉడికించాలి.
15. తర్వాత మూత తీసి పైన కాస్త గరం మసాలా చల్లుకొని కలుపుకోవాలి.
16. ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేయాలి. అంతే శెనగపప్పుతో చికెన్ కీమా కర్రీ రెడీ అయినట్.టే ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది.
ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి శెనగపప్పుతో కలిపి వండండి. రుచి అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ రెసిపీని వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీ, రోటీల్లో కూడా తినవచ్చు. ఇందులో చికెన్ కీమాను నూనెలో వేయించకుండా… ఉడికించాము. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలే చేస్తుంది. చికెన్, శెనగపప్పు రెండిట్లోనే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
టాపిక్