Best Web Hosting Provider In India 2024
Intinti Ramayanam Serial TV Premiere Date: ఒకప్పుడు ప్రతి తెలుగు లోగిలిలో వైభవంగా వెలిగిన ఉమ్మడి కుటుంబాన్ని మరోసారి తెరపైకి తెస్తూ స్టార్ మా (Star Maa Channel) “ఇంటింటి రామాయణం” పేరుతో సరికొత్త సీరియల్ మొదలుపెడుతోంది. ఒక కుటుంబం అంటే ముగ్గురికో నలుగురికో కుదించుకుపోయిన ఈ రోజుల్లో అలాంటి ఉమ్మడి కుటుంబాన్ని చూడడమే ఒక కన్నుల పండుగ.
ఆ అపురూపమైన ఇల్లు.. ఓ అచ్చమైన బొమ్మరిల్లు.. ముచ్చటైన పొదరిల్లు. దాదాపుగా 20 మంది ఉన్న ఆ కుటుంబంలో మనుషుల మధ్య అనుబంధాలు, వాటి ఆనవాళ్లు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులకు మళ్లీ గుర్తుచేయబోతోంది. ఒకప్పుడు మనం చూసి, ఇప్పుడు దూరమైన ఆ మధురానుభూతుల్ని “ఇంటింటి రామాయణం”తో (Intinti Ramayanam Serial) ప్రియ ప్రేక్షకులకు పంచబోతోంది.
సీతమ్మ తల్లి లాంటి కోడలు ఇంటిని నడిపిస్తే అది ఎంత అందంగా ఉంటుందో ఆ ఇంటిని చూసి నేర్చుకోవచ్చు. ఒక ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఎంత బావుంటుందో.. వాళ్లు చెప్పే నాలుగు మంచి మాటలు కుటుంబాన్నిఎంత బాగా నడిపిస్తాయో.. ఆ కుటుంబాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఒక చిన్న పిల్ల ఇంటికి వెలుగై ఎంత అందంగా ఉంటుందో అక్కడ చూసి సంబరపడవచ్చు.
అలాంటి ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మాలో జూన్ 10 నుంచి రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 గంటలకు ఇంటింటి రామాయణం సీరియల్‌ను టెలీకాస్ట్ చేయనుంది స్టార్ మా. రెండు కుటుంబాల మధ్య ఒక పెళ్లితో మొదలైన గొడవ.. ఇంకో పెళ్లితో పరిష్కారం కావాలని తపనపడే ఓ అవని ప్రయత్నం ఎటు దారితీసింది అనేది కథలో ఒక అంశం.
ఆవని అంటే ఆ ఇంటి పెద్దకోడలు. పెద్దకోడలిగా ఆమె తీసుకున్న బాధ్యత విజయవంతం అవుతుందా లేదా అనేదానికి సమాధానం తెలియాలంటే “ఇంటింటి రామాయణం” చూడాల్సిందే. సంతోషంగా ఉన్న ఇంట్లో కూడా ఒక సమస్య ఉంది. అది పరిష్కారం అవుతుందా? లేక ఆ ఉమ్మడి కుటుంబంలోకి కొత్త సమస్యని తీసుకు రాబోతోందా అనే ప్రశ్నకు సమాధానం ఈ ధారావాహిక.
ఇదిలా ఉంటే, స్టార్ మా ఛానెల్లో ఇప్పటికే పలు సీరియల్స్ చాలా పాపులర్ అయ్యాయి. వాటిలో ముందు చెప్పుకోవాల్సింది బ్రహ్మముడి సీరియల్ (Brahmamudi Serial). ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఎప్పుడూ సరికొత్త సమస్యతో దాన్ని డిఫరెంట్‌గా సాల్వ్ చేస్తూ సాగే ఈ సీరియల్ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.
ఇక స్టార్ మాలో ప్రసారమయ్యే మరో పాపులర్ సీరియల్లో గుప్పెడంత మనసు (Guppedantha Manasu Serial) ఒకటి. రక్ష గౌడ, ముఖేష్ గౌడ, సాయి కిరణ్ ప్రధాన పాత్రల్లో సాగే ఈ సీరియల్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. రిషి ప్రేమ కోసం తహతహలాడే వసుధార పాత్రలో రక్షగౌడ ఒదిగిపోయింది. ఇక డీబీఎస్టీ కాలేజీ ఎండీ సీటు దక్కించుకోవాలనే శైలేంద్ర ప్రయత్నాలతో సాగుతుంది సీరియల్.
వీటితోపాటు కృష్ణ ముకుంద మురారి సీరియల్ (Krishna Mukunda Murari Serial) కూడా ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ తెచ్చుకుంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సీరియల్ కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits