Egg Gravy Recipe: కోడిగుడ్డు కూరను మెంతి ఆకులు వేసి వండితే ఆ రుచే వేరు

Best Web Hosting Provider In India 2024

Egg Gravy Recipe: కోడి గుడ్డు కూరను ఇష్టపడేవారు ఒకసారి మెంతాకు కోడిగుడ్డు ఇగురును వండి చూడండి. వేడివేడి అన్నంలో ఈ ఇగురును వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.

మెంతి ఆకులు కోడిగుడ్డు కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఉడికించిన గుడ్లు – నాలుగు

మెంతికూర తరుగు – రెండు కప్పులు

జీలకర్ర – ఒక స్పూన్

యాలకులు – రెండు

ఉప్పు – రుచికి సరిపడినంత

ఉల్లిపాయ – ఒకటి

టమోటాలు – రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్

కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు

పసుపు – అర స్పూను

కారం – ఒక స్పూను

గరం మసాలా – అర స్పూను

ధనియాల పొడి – ఒక స్పూను

జీలకర్ర పొడి – అర స్పూను

నూనె – రెండు స్పూన్లు

మెంతిఆకు కోడిగుడ్డు కూర రెసిపీ

1. కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

2. మెంతి ఆకును ఏరి సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. చిటికెడు ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించిన కోడిగుడ్లను కూడా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు అదే కళాయిలో మరి కాస్త నూనె వేసి జీలకర్ర, యాలకులు వేసి వేయించాలి.

6. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించుకోవాలి. వాటి రంగు మారేవరకు ఉంచాలి.

7. తర్వాత టమోటో తరుగును వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

8. టమోటా ముక్కలు మెత్తగా మగ్గుతాయి. ఆ తర్వాత మెంతికూర తరుగు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.

9. మూత పెట్టి ఇగురులాగా వచ్చేవరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి గరిటతో ఒకసారి కలుపుకోవాలి.

10. ముందుగా వేయించిన కోడిగుడ్లను కూడా అందులో వేసి పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.

11. పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ టేస్టీ మెంతిఆకు కోడిగుడ్డు కూర రెడీ అయినట్టే. దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది.

కోడిగుడ్లు మెంతి ఆకులు… రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతి ఆకులను తినమని వైద్యులు ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. రోజుకో గుడ్డు తినమని సిఫారసు చేస్తారు. ఈ రెండింటిని కలిపి వండుకోవడం వల్ల ఎన్నో పోషకాలు శరీరంలో చేరుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఈ రెసిపీ ఎంతో మంచిది. ఎందుకంటే మెంతి ఆకులు, కోడిగుడ్లు ఈ రెండూ కూడా డయాబెటిస్ ను అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి. కాబట్టి వారానికి కనీసం రెండుసార్లు మెంతాకుతో కోడిగుడ్డు గ్రేవీ వండుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024