Best Web Hosting Provider In India 2024
Chicken Cheese Sandwich: బ్రేక్ ఫాస్ట్‌లో సింపుల్‌గా అయిపోయే అల్పాహారాల కోసం వెతుకుతున్నారా? అయితే చికెన్ చీజ్ సాండ్విచ్ రెసిపీ ప్రయత్నించండి. ఇది టేస్టీగా ఉండడమే కాదు… తినాలన్నా కోరికను పెంచుతుంది. దీని చేయడం కూడా చాలా సులువు. బయటకొనే కన్నా ఇంట్లోనే దీన్ని చేసుకుంటే ఆరోగ్యకరం. చికెన్ చీజ్ సాండ్విచ్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి
చికెన్ చీజ్ సాండ్విచ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ తురుము – అరకప్పు
చీజ్ తురుము – పావు కప్పు
ఒరెగానో – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
టమోటోలు – ఒకటి
బటర్ – రెండు స్పూన్లు
మిరియాల పొడి – పావు స్పూను
చికెన్ చీజ్ సాండ్విచ్ రెసిపీ
1. ఈ సాండ్విచ్ చేయడానికి ముందుగా బ్రెడ్‌ను టోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి.
2. చికెన్‌ను ముందుగానే బాగా ఉడకబెట్టి చిన్నగా తరిగి పక్కన పెట్టుకోండి.
3. చికెన్ ఉడికించినప్పుడే ఉప్పును వేసి ఉడికించడం మంచిది.
4. ఇప్పుడు బ్రెడ్ టోస్టులపై కాస్త బటర్ రాసి తురిమిన చికెన్ వేయండి.
5. పైన చీజ్‌ను కూడా చల్లండి. అలాగే సన్నగా తరిగిన టమోటో ముక్కలను పెట్టండి.
6. పైన మిరియాల పొడిని చల్లండి. మళ్లీ అలాగే ఒరెగానో కూడా చల్లుకోండి.
7. ఆపైన మళ్లీ తురిమిన చికెన్ ముక్కలను వేయండి. అలాగే చీజ్ తురుమును కూడా వేసి మరొక బ్రెడ్ ను పైన పెట్టండి.
8. అంతే టేస్టీ చికెన్ చీజ్ సాండ్విచ్ రెడీ అయిపోతుంది.
9. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్‌లో ఉప్పు మాత్రమే కాకుండా కాస్త పసుపు, కారం వంటివి వేసి ఉడికించి, సన్నగా తరిగిన చికెన్ ను ఒకసారి ఆయిల్ లో ఫ్రై చేసుకుని వాడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది మీ ఇష్టప్రకారం చేసుకోవచ్చు.
చికెన్ ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది. అల్పాహారంలో ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినమని కూడా వైద్యులు సూచిస్తూ ఉంటారు. అలాంటివారికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఇంట్లోనే ఇలాంటి చికెన్ చీజ్ సాండ్విచ్లో ఆరోగ్యకరంగా తినడం వల్ల బయట ఫుడ్ తినే అవకాశం ఉండదు. ఒకసారి ఈ చికెన్ చీజ్ సాండ్విచ్ ప్రయత్నించి చూడండి. దీన్ని చేయడం చాలా సులువు. కేవలం చికెన్ ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది.
టాపిక్