Best Web Hosting Provider In India 2024
Balakrishna NBK 109: నటసింహం, హీరో నందమూరి బాలకృష్ణ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయయ్యారు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ తరుణంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‍బీకే 109 నుంచి స్పెషల్ గ్లింప్స్ వచ్చేస్తోంది. రేపు (జూన్ 10) బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మాస్ ట్రీట్ రానుంది. ఈ గ్లింప్స్ రిలీజ్ చేసే టైమ్‍ను నేడు ఫిక్స్ చేసింది మూవీ టీమ్.
టైమ్ ఇదే
ఎన్‍బీకే 109 చిత్రం నుంచి రేపు (జూన్ 10) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు గ్లింప్స్ రానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూన్ 9) వెల్లడించింది. డేట్ ఇటీవలే ఖరారు కాగా.. నేడు టైమ్‍ను ఫిక్స్ చేసింది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ వస్తోంది.
పొగమంచులో బ్యాగ్‍లు పట్టుకొని బాలయ్య నడిచి వస్తున్నట్టుగా ఓ పోస్టర్ వెల్లడించింది మూవీ టీమ్. ఆ పొగ మంచు రేపు క్లియర్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “మాన్‍స్టర్‌ను రివీల్ చేస్తున్నాం. రేపు ఉదయం 11:27 గంటలకు పొగ మంచు క్లియర్ అవుతుంది” అని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది.
ఇప్పటికే ఎన్‍బీకే 109 నుంచి ఓ గ్లింప్స్ వచ్చింది. పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగ్‍తో అదిరిపోయింది. ఇప్పుడు రెండో గ్లింప్స్ వస్తోంది. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
టైటిల్ రివీల్ చేస్తారా?
రేపు రానున్న ఈ గ్లింప్స్‌లో మూవీ టైటిల్‍ను టీమ్ రివీల్ చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ చిత్రం టైటిల్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. అలాగే, ఈ సినిమాను రిలీజ్‍పై కూడా మేకర్స్ క్లారిటీ ఇస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఎన్‍బీకే 109 గ్లింప్స్‌పై చాలా క్యూరియాసిటీ ఉంది.
బాబీ కొల్లి ఈ చిత్రాన్ని పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది శివరాత్రికి రిలీజైన గ్లింప్స్‌లో బాలకృష్ణ యాక్షన్ అదిరిపోయింది. ‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’ అంటూ బాలయ్య డైలాగ్.. ఆ తర్వాత తెగనరుకుడు ఉన్నాయి. ఇక ఇప్పుడు వచ్చే రెండో గ్లింప్స్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
ఎన్‍బీకే 109 చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‍గా నటిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఓ పాత్ర చేస్తారనే రూమర్ ఉంది. అయితే, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఎన్‍బీకే 109 చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గతేడాది భగవంత్ కేసరితో బ్లాక్‍బస్టర్ హిట్ కొట్టారు బాలకృష్ణ. ఎన్‍బీకే 109 విషయంలోనూ అదే రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం అదిరిపోయేలా ఉంటుందని దర్శకుడు బాబీ కూడా నమ్మకంగా చెబుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits