Best Web Hosting Provider In India 2024
గుంటూరు: లోకేష్ పాదయాత్ర కొంతదూరం సాగిన తరువాత అది యువ గళమో.. యువ గరళమో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థం అవుతుందని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా లోకేష్ తీరు ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయాల్లో లోకేష్‌ది బఫూన్ క్యారెక్టర్, ఆ బఫూన్ని రాష్ట్రం మీద రుద్దాలని తాపత్రయపడుతున్నారన్నారు. లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడన్నారు. రాష్ట్రంలో ఇద్దరు బఫూన్లు తయారయ్యారని, ఒకరు చంద్రబాబు పుత్రుడు లోకేష్.. మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి ఇంకా ఏం మాట్లాడారంటే..
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీస్ వ్యవస్థ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 500 మంది పోలీసులు వచ్చారని, వారంతా ఏమి చేయడానికి వచ్చారో అని అచ్చెన్నాయుడు వాడిన భాష చాలా అభ్యంతరకరం. రాష్ట్ర ప్రజలంతా చీదరించుకుంటున్నారు. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అచ్చెన్న వ్యాఖ్యలను బట్టి యువగళం అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ప్రజలు పాల్గొనలేదనే నిస్పృహ, నిరాశతో మాట్లాడిన మాటలుగా భావిస్తున్నాం. ఒక సీనియర్ నేత బూతులు మాట్లాడుతున్నాడంటే.. వారి పతనానికి నాంది పలికే పరిస్థితి వచ్చిందనే విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.
నాయకుడిగా లోకేష్ ప్రజల్లోంచి రాలేదు. దొడ్డిదారిన మంత్రి అయ్యాడు. మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టే నువ్వు ఎమ్మెల్సీవి, మంత్రివి అయ్యావు. అదేదో పెద్ద గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చాలా దురదృష్టకరం. అర్హత లేని వ్యక్తులు పాదయాత్రలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో రాబోయే కాలంలో ప్రజలంతా చూస్తారు.
గొడ్డొచ్చిన వేళ.. బిడ్డొచ్చిన వేళ అనే సామెత ఉంది. ఒకొక్కరి పాదం ఒక్కోలా ఉంటుంది. ఆ పాదం మోపితే ఏరకంగా ఉంటుందో రాబోయే కాలంలో మనం చూస్తాం. చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. లోకేష్, టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతకరమైన భాష వాడుతున్నాడు. పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఉపన్యాసంలో అన్నీ తప్పులే. అర్హత అనే పదం కూడా స్పష్టంగా పలకలేని దశలో ఉండి తెలుగు రాష్ట్రానికి నాయకుడిని అవుతానని ముందుకెళ్లడం దురదృష్టకర పరిణామం.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాత్మక పాదయాత్ర చేసిన ఘనుడు వైయస్ఆర్.
Best Web Hosting Provider In India 2024
చిత్తశుద్ధి లేని శివపూజ మంచిది కాదు.. చిత్తశుద్ధి లేని పాదయాత్ర కూడా మంచిది కాదు. లోకేష్ తానేదో పెరగాలనే తాపత్రయంతో చేస్తున్న పాదయాత్ర ఇది. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ..? చంద్రబాబా..? లోకేషా..? వారాహి మీద వచ్చే పవన్ కల్యాణా..? మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో మీకే క్లారిటీ లేని దశలో మీరున్నారు. అందరూ కట్టగట్టుకొని వచ్చినా సీఎం వైయస్ జగన్‌ను ఓడించడం మీ వల్ల కాదు.
రిపబ్లిక్ డే రోజున పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ‘మా నాయనమ్మ దీపారాధన చేస్తుంటే దాంతో మా నాన్న సిగరెట్ వెలిగించుకున్నాడు’lఅని పవన్ చెబుతున్నాడు. సహజంగా ఇలాంటివి సినిమాల్లో విలన్ దగ్గర చూస్తాం. తండ్రి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులను సమాజం గౌరవించాలా..? దీనికి పవన్ అన్నయ్యలు చిరంజీవి, నాగబాబు సమాధానం చెప్పాలి. పిచ్చి కేకలు పెట్టేవారికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు. సంస్కారం లేని హీనులు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు. వారి దగ్గర మెతుకు కూడా తినకుండా ఉంటే మీకు గౌరవంగా ఉంటుందని పోలీసులకు వినయపూర్వకంగా సూచిస్తున్నాను.
సీఎం వైయస్ జగన్ ప్రజల్లోకి రాలేదు. వచ్చిన తరువాత ప్రజానాయకుడి పవర్ ఏంటో చూస్తారు. ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధిగా నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం.. వైయస్ జగన్ ప్రభుత్వం. రాబోయే కాలంలో కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఎందరు కలిసి వచ్చినా జగన్నాథ రధచక్రాల కింద నలిగిపోవాల్సిందే తప్ప.. రాజకీయంగా బతికి బట్టకట్టలేరు. అది చంద్రబాబు, పవన్, లోకేష్‌కు S తెలిసినా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
లోకేష్ చేపట్టే పాదయాత్ర కామెడీ షోగా మిగిలిపోతుంది. చివరకు యువ గరళం భస్మాసురహస్తం కాబోతోంది. అంతిమ విజయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, వైయస్ జగన్‌దే అందులో సందేహం లేదు’’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.