Best Web Hosting Provider In India 2024
Mirzapur S3 Release: మీర్జాపూర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. అత్యధిక మంది చూసిన ఇండియన్ సిరీస్‌ల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. అయితే, మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. 2020లో రెండో సీజన్ రాగా.. మూడో సీజన్ కోసం నిరీక్షిస్తున్నారు. అయితే, ఎట్టకేలకు వెయింటింగ్ ముగియనుంది. త్వరలోనే మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్కు వచ్చేయనుంది. స్ట్రీమింగ్ డేట్ కోసం ఓ యానిమేటెడ్ పోస్టర్ రిలీజ్ చేసింది ప్రైమ్ వీడియో. అయితే, అందులో డేట్ ఏదో కనుక్కోవాలని ప్రేక్షకులకే పరీక్ష పెట్టింది.
ఇందులోనే ఉంది.. కనుక్కోండి
మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ యానిమేటెడ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే, ఆ పోస్టర్లో డేట్ దాగి ఉందని దాన్ని కనిపెట్టాలని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు పనిపెట్టింది. ఆ పోస్టర్లో మీర్జాపూర్ సిరీస్‌లోని కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్లతో పాటు గన్స్, జీప్, కార్పెట్లు, బుల్లెట్లు సహా మరిన్ని వస్తువులు ఉన్నాయి.
“మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ డేట్ ఇందులో దాక్కొని ఉంది. వెతుక్కుంటే వెతుక్కోండి” అంటూ ఈ పోస్టర్ తీసుకొచ్చింది ప్రైమ్ వీడియో. అడగడం కాదు.. ఇప్పుడు వెతకాలి అంటూ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ రివీల్ చేసింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
మీర్జాపూర్ సీజన్ 3 జూలైలో వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రైమ్ వీడియో ఓటీటీ ఇచ్చిన పోస్టర్‌పై కొందరు నెటిజన్లు స్పందించారు. జూలై 7వ తేదీన ఈ సీజన్ స్ట్రీమింగ్కు రానుందని అంటున్నారు. ఈ పోస్టర్లో ఏడు గన్లు ఉన్నాయని, జీప్ నంబర్ ప్లేట్‌పై ఏడు స్పష్టంగా కనిపిస్తోందని, ఏడు కార్పెట్లు ఉన్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అందుకే జూలై 7వ తేదీన ఈ సీజన్ స్ట్రీమింగ్కు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఏడు మూడుసార్లు రిపీట్ అయిందని.. 7×3 ప్రకారం చూస్తే జూలై 21న ఈ సీజన్ స్ట్రీమింగ్కు వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. అయితే, జూలై 7వ తేదీన స్ట్రీమింగ్కు వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 7 అంటూ మరికొందు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తంగా మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ విషయంలో ప్రైమ్ వీడియో పెద్ద ట్విస్టే ఇచ్చింది. అభిమానులకే పనిపెట్టింది. మరి, ఈ సీజన్ స్ట్రీమింగ్ డేట్‌ను స్పష్టంగా ఎప్పుడు వెల్లడిస్తోందో చూడాలి.
మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో రాహుల్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్, శ్రీయా పిల్గోయాంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ ఆయుష్మాన్, ఈ సిరీస్‌కు కరణ్ అనుష్మాన్, గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
మీర్జాపూర్ ఫస్ట్ సీజన్ 2018 నవంబర్‌లో వచ్చింది. రెండో సీజన్ 2020 అక్టోబర్‌లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చింది. మీర్జాపూర్‌పై ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలు, పోరాటాలతో ఈ రెండు సీజన్లు ఆకట్టుకున్నాయి. గ్రిప్పింగ్ స్టోరీ, నటీనటుల సూపర్ పర్ఫార్మెన్స్లు ప్రేక్షకులను మెప్పించాయి.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits