Best Web Hosting Provider In India 2024
NNS 10th June Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (జూన్ 10) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి గోల లేకపోతే నాన్న దగ్గరకు వెళ్లి విష్ చేసేదాన్నక్కా.. అంటూ అరుంధతి దగ్గర బాధపడుతుంది భాగీ. అప్పుడే రామ్మూర్తి, మంగళ గేట్ నుంచి ఇంట్లోకి వస్తూ కనిపిస్తారు. మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి రామ్మూర్తిని కౌగిలించుకుని ఇప్పుడే మీ గురించి అక్కతో చెప్తున్నాను అంతలోనే మీరొచ్చారని అంటుంది.
తండ్రికి అరుంధతి ఫాదర్స్ డే విషెస్
అక్క ఎవరమ్మా..? అని రామ్మూర్తి అడగ్గానే పక్కింటి అక్క నాన్న.. మీకు ఇప్పుడే పరిచయం చేస్తాను అని మిస్సమ్మ పక్కకు చూడగానే అరుంధతి కనిపించదు. ఎప్పుడూ చూసినా ఎవరికైనా పరిచయం చేద్దామంటే కనబడకుండా వెళ్లిపోతుందేంటి? అనుకుంటుంది మిస్సమ్మ. ఆ మాట విన్న మంగళ అరుంధతి ఆత్మ ఇక్కడే ఉందన్నమాట అనుకుంటుంది.
మిస్సమ్మ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పి లోపలికి వెళ్తుంది. నన్ను వదిలేసి వెళ్లినప్పటినుంచి నా తల్లిదండ్రులు నా గురించి ఆలోచించి ఉంటారా గుప్తగారు అని బాధపడుతుంది అరుంధతి. ఆమె బాధ చూసి వెళ్లి రామ్మూర్తికి పితృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పమంటాడు గుప్త. అదేంటి గుప్తగారు.. ఆయన భాగీ వాళ్ల నాన్నగారు కదా అంటుంది అరుంధతి.
ఆ బాలిక నిన్ను అక్కా అంటుంది కదా.. అంటే ఆ బాలిక తండ్రి నీకు కూడా తండ్రిలాంటి వారే కదా వెళ్లి చెప్పు అంటాడు గుప్త. సరేనంటూ సంతోషంగా వెళ్లి రామ్మూర్తికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతుంది అరుంధతి. రామ్మూర్తి కూడా అక్కడ ఎవరో ఉన్నట్లు తనను ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు అనిపించి చల్లగా ఉండమ్మా అని దీవిస్తాడు.
అమర్ అనుమతి అడిగిన రామ్మూర్తి
రామ్మూర్తి లోపలికి వెళ్లగానే పిల్లలందరూ తాతయ్యా అంటూ వెళ్లి హ్యపీగా ఫీలవుతారు. ఏంటి బావగారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంటాడు శివరామ్. బాగుంది బాబుగారు అంటాడు రామ్మూర్తి. భలే టైంకు వచ్చారు బావగారు. ఇవాళ ఫాదర్స్ డే అందరం జరుపుకుంటున్నాం. మిస్సమ్మకు మీరు తోడు లేరని అనుకుంటున్నాం. ఇంతలో మీరు వచ్చారు అంటాడు శివరామ్.
ఇందాకే చెప్పింది బాబుగారు అంటాడు రామ్మూర్తి. ఇంతలో అమర్ అమ్మా నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్లేసి వస్తాను అంటూ బయల్దేరతాడు. ఒక్క నిమిషం బాబు.. అని అమర్‌ని ఆపుతుంది మంగళ. ఏమైంది నాన్నా ఆయనతో ఏమైనా చెప్పాలా? అని అడుగుతుంది మిస్సమ్మ. ఏమీ లేదమ్మా అదంత ముఖ్యమైన విషయం ఏం కాదులే.. అంటాడు రామ్మూర్తి.
చల్లకొచ్చి ముంత దాచినట్టు.. మాట్లాడటానికి వచ్చి ఇప్పుడు కాదంటున్నావు అంటుంది మంగళ. ఏమైంది నాన్నా ఏమైనా సమస్యా అని మిస్సమ్మ అడగ్గానే మేం బతకడానికి మేం కష్టపడక తప్పదు కదా బాబు.. ఈయన మళ్లీ స్కూల్‌లో వాచ్‌మెన్‌గా చేరాలని అనుకుంటున్నాడు. కాకపోతే మీ పిల్లలు చదివే స్కూల్ కదా అందుకనే అడగడానికి వచ్చాము బాబు అని మంగళ చెప్తుంది. దీంతో మిస్సమ్మ వద్దని చెప్తుంది. నిర్మల, శివరాం కూడా వద్దని, మేము చూసుకుంటామని చెప్తారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుందని ఏదో ఒక పని చేసుకుంటేనే మాకు ఆనందంగా ఉంటుందని చెప్తాడు.
రామ్మూర్తికి అండగా అమర్
ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకుంటే కూతురు అమ్మానాన్నల బాధ్యత చూసుకోకూడదా? అంటుంది మిస్సమ్మ. ఇప్పుడు నీ పని నన్ను చూసుకోవడం కాదమ్మా ఈ ఇంటిని ఈ ఇంట్లో వాళ్లను చూసుకోవడం. వీళ్ల తర్వాతే నీకు ఎవరైనా.. ఆఖరికి నేనైనా.. అంటాడు రామ్మూర్తి.
నేను మిమ్మల్ని చూసుకుంటానండి. ఈ మాట నేను మీ కూతురు మెడలో తాళి కట్టినందుకు చెప్పడం లేదండి. నేను అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను. నా భార్యకు నాన్నను అని మీరనుకున్నందుకు చెప్తున్నాను అని అమర్ చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు.
అరుంధతి ఆత్మ గురించి తెలుసుకున్న మనోహరి
మనోహరి సీరియస్‌గా ఆలోచిస్తుంది. ఇంతలో మనోహరి రూంలోకి మంగళ వస్తుంది. మనోహరి, మంగళను తిడుతుంది. రెండు పడవల మీద కాలు పెడితే నీకే ప్రమాదం అంటూ హెచ్చిరిస్తుంది. దీంతో నేనెప్పుడూ నీ పడవలోనే ఉన్నాను అని చెప్తుంది మంగళ. అది సరే కానీ నేను మొన్న ఫోన్‌లో చెప్పిన విషయం ఏమైంది అని అడుగుతుంది. ఏ విషయం? అంటుంది మనోహరి.
అదే ఆరుంధతి ఆత్మ ఇక్కడ తిరగడం గురించి.. కచ్చితంగా ఆత్మ ఇక్కడే ఉంది మనోహరి. ఇందాక కూడా ఆ భాగి ఆత్మతోనే మాట్లాడిందేమో అనిపించింది అంటుంది మంగళ. అరుంధతి ఇక్కడే ఉంటే నేను చేసినవన్నీ చేసేటివన్నీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు నన్నేం చేయడం లేదు. నిజంగా అది ఇక్కడే ఉందా లేదా? అని మనోహరి అనగానే మంగళ ఆత్మకు మనిషిని ఏమైనా చేసే శక్తి ఉంటుందా? అని అడగ్గానే వెంటనే మనోహరికి మిస్సమ్మ, అమ్ము మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి దీంతో మనం వెంటనే ఘోరాను కలవాలని అంటుంది.
కిచెన్‌లో మిస్సమ్మ వంట చేస్తుంటే అమ్ము వస్తుంది. ఏదైనా కావాలా అమ్ము అని మిస్సమ్మ అడగ్గానే అమ్ము మిస్సమ్మను తిడుతుంది. అయితే పెళ్లి రోజు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అనగానే అమ్ము అయితే ఆరోజు ఏం జరిగిందో నీకు గుర్తు లేదు. నిన్న ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అనగానే మిస్సమ్మ షాక్ అవుతుంది. మిస్సమ్మను అమ్ము నమ్ముతుందా? తను అక్కా అని పిలిచేది అరుంధతి ఆత్మని అని భాగీకి తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జూన్ 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits