Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం నుంచి ‘గరం గరం’.. డేట్ ఇదేే

Best Web Hosting Provider In India 2024


Saripodhaa Sanivaaram First Song: హాయ్ నాన్న సినిమాతో నేచురల్ స్టార్ నాని గతేడాది బ్లాక్‍బస్టర్ కొట్టారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నారు నాని. శనివారం మాత్రం కోపాన్ని చూపించే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ వస్తోంది. నాని – వివేక్ కాంబోలో తెరకెక్కిన ‘అంటే సుందరానికి’ కమర్షియల్‍గా హిట్ కాకపోయినా.. మంచి సినిమాగా ప్రశంసలు పొందింది. సరిపోదా శనివారంతో ఇప్పుడు వీరి కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా, ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్పుడే వచ్చేస్తోంది.

గరం.. గరం అంటూ..

‘సరిపోదా శనివారం’ పాట గురించి మూవీ టీమ్ అప్‍డేట్ ఇచ్చింది. ‘గరం.. గరం’ అంటూ ఈ పాట ఉంటుందని వెల్లడించింది. జూన్ 15వ తేదీన శనివారం ఈ సాంగ్ రిలీజ్ కానుంది. పాట డేట్‍ను టీమ్ ఇప్పటికే వెల్లడించగా.. ‘గరం గరం’ పేరుతో ఈ సాంగ్ రానుందని నేడు (జూన్ 11) ప్రకటించింది.

నాని సీరియస్‍గా, ఇంటెన్స్‌గా చూస్తున్న ఓ పోస్టర్ నేడు రిలీజ్ చేసింది మూవీ టీమ్. జూన్ 15వ తేదీన గరం గరం సాంగ్ రానుందని వెల్లడించింది. “ఈ శనివారం కోసం గరం గరం సాంగ్‍ను సూర్య తీసుకొస్తున్నాడు. జూన్ 15న సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ సింగిల్ కోసం మీ వూఫర్లను రెడీ చేసుకోండి” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ నేడు ట్వీట్ చేసింది. ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ట్యాక్సీ వాలా, చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్, ఒకే ఒక జీవితం చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశాడు జేక్స్.

మూవీకి సూపర్ క్రేజ్

సరిపోదా శనివారం చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు కామెడీ చిత్రాలనే ఎక్కువగా చేసి మెప్పించిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తుండటంతో చాలా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌లో నాని లుక్ అదిరిపోయింది. శనివారమే కోపం అనే కాన్సెప్స్ కూడా డిఫరెంట్‍గా ఉంది. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.

సరిపోదా శనివారం మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ చిత్రం తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతోంది. సరిపోదా శనివారం మూవీలో ఎస్‍జే సూర్య, సాయికుమార్ కీలకపాత్రలు చేస్తున్నారు.

సరిపోదా శనివారం మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ రిలీజ్ అవుతోంది.

నాని లైనప్‍పై సందిగ్ధత

సరిపోదా శనివారం తర్వాత నాని ఏ మూవీ చేస్తారనే విషయం ఉత్కంఠగా ఉంది. తనకు దసరా లాంటి బ్లాక్‍బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీకి నాని ఓకే చెప్పారు. దర్శకుడు సుజీత్‍తో ఓ చిత్రానికి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారీ బడ్జెట్ అవుతుందనే కారణాల వల్ల ఈ మూవీని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు రూమర్లు ఉన్నాయి. బలగం డైరెక్టర్ వేణుతో నాని.. ఎల్లమ్మ చిత్రం చేయాల్సి ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024