Best Web Hosting Provider In India 2024
ట్రాయ్‌కి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్‌కి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సాక్షితో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోంది.
సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
మరోవైపు, రాష్ట్రంలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు