Yakshini OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. శాపంతో రగిలిపోయే దెయ్యం కథ.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024


Yakshini OTT Release: ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీసులు కూడా మూవీ లవర్స్‌ను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంటాయి. ఈ సిరీసులతో పూర్తి ఎంటర్టైన్‌మెంట్ ఫీల్ అవుతారు ఓటీటీ ఆడియెన్స్. అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థలు, దర్శకనిర్మాతలు ఈ వెబ్ సిరీసులను తెరకెక్కించేదుకు ఆసక్తి చూపిస్తుంటారు.

ఇక క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, లవ్ అండ్ రొమాన్స్, హారర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ జోనర్లలో వెబ్ సిరీసులను రూపొందిస్తూ మరింత అదనపు వినోదం పంచుతున్నాయి ఓటీటీలు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓటీటీలోకి హారర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తోపాటు లవ్, రొమాన్స్, సస్పెన్స్ వంటి థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఆ సిరీస్ ఏదో కాదు యక్షిణి. సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా వచ్చిన ఈ యక్షిణి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 14 అంటే శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో యక్షిణి ప్రసారం అవుతోంది. అదికూడా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది యక్షిణి వెబ్ సిరీస్.

ఫాంటసీ, హారర్ జోనర్స్ ఇష్టపడేవారికి ఈ వెబ్ సిరీస్ మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుంది. ఫాంటసీ జోనర్‌కు హారర్, లవ్, రొమాన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేసి డైరెక్టర్ తేజ మార్ని తెరకెక్కించారు. కాగా ఈ యక్షిణి వెబ్ సిరీస్‌ను బాహుబలి నిర్మాతలు అయిన ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించింది.

ఈ వెబ్ సిరీస్‌కు ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇందులో బ్యూటిఫుల్ వేదిక, మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి, కోట బొమ్మాలి పీఎస్ ఫేమ్ రాహుల్ విజయ్, యాక్టర్ అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యక్షిణి వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌ను జోరుగా చేశారు. ముఖ్యంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ తేజ మార్ని ఆసక్తికర విశేషాలు చెప్పారు.

“సినిమా చేయడానికి సిరీస్ మేకింగ్‌కు చాలా తేడా ఉంటుంది. సినిమాను రెండున్నర గంటల్లో చెబితే సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ డిజైన్ చేయాలి. ఆ ఎపిసోడ్‌లో రెండు మూడు చోట్ల ఎగ్జైట్ చేయించాలి. నేను యక్షిణి చేసే ప్రాసెస్‌లో దర్శకుడిగా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. ఆర్కా లాంటి బిగ్ బ్యానర్‌లో నేను ఈ సిరీస్ చేయడం హ్యాపీగా ఉంది” అని డైరెక్టర్ తేజ మార్ని తెలిపారు.

“రైటర్ రామ్ వంశీ కృష్ణ నా ఫస్ట్ మూవీ జోహార్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ఒక సోషియో ఫాంటసీ లైన్‌తో యక్షిణి స్క్రిప్ట్ చెప్పాడు. లైన్‌గా చెప్పాలంటే అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వల్ల భూమ్మీదకు వచ్చిన యక్షిణి వంద మందిని చంపితేగానీ శాప విముక్తి కాదు. ఆ వంద మందిని ఎలా చంపింది. వందో వ్యక్తి ఎవరు అనేది ఈ సిరీస్ స్టోరీ” అని తేజ మార్ని కథ గురించి చెప్పారు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024