Best Web Hosting Provider In India 2024
ఇరవై రోజుల్లోనే…
థియేటర్లలో విడుదలైన ఇరవై రోజుల్లోనే లవ్ మీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మే 25న ఈ హారర్ సినిమా థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. సినిమా కాన్సెప్ట్ బాగుందనే టాక్ వచ్చినా హారర్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, కథలో కన్ఫ్యూజన్ ఎక్కువ కావడంతో లవ్ మీ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
లవ్ మీ మూవీలో ఆశీష్ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి కీలక పాత్రలు పోషించారు.
దిల్ రాజు కూతురు ప్రొడ్యూసర్…
లవ్ మీ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే దర్శకుడిగా అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దిల్‌రాజు కూతురు హన్షిత తో కలిసి హర్షిత్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. లవ్ మూవీ మూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిచంగా…పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. దిల్ రాజు సమర్పణలో అగ్ర సాంకేతిక నిపుణుల కలయికలో వచ్చిన ఈ మూవీ టీజర్స్, ట్రైలర్స్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేశారు. ప్రమోషన్స్ పీక్స్‌లో చేసినా కంటెంట్ వీక్ కావడంతో లవ్ మీ ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది.
లవ్ మీ కథ ఇదే…
అర్జున్ (ఆశీష్) దయ్యాలు లేవని నిరూపించే వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తుంటాడు. ఓ రోజు అతడికి దివ్యవతి అనే దయ్యం గురించి తెలుస్తుంది. దివ్యవతిని చూసిన వారు ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదని కథలు కథలుగా జనాలు చెప్పుకోవడం అర్జున్ వింటాడు.
అన్నయ్య ప్రతాప్( రవికృష్ణ)తో కలిసి దివ్యవతిని వెతుక్కుంటూ వెళతాడు అర్జున్. దివ్యవతి గురించి అర్జున్ ఏం తెలుసుకున్నాడు? దయ్యాన్ని ప్రేమించాలని అర్జున్ ఎందుకు అనుకున్నాడు? అతడి ప్రేమ కథ ఏమైంది? అర్జున్‌కు ప్రియకు (వైష్ణవి చైతన్య) ఉన్న సంబంధం ఏమిటి? ఆ ఊరిలో కొంతమంది అమ్మాయిలు కనిపించకుండాపోవడానికి కారణం ఏమిటి? అన్నదే లవ్ మీ కథ.
వైష్ణవి చైతన్య సెకండ్ మూవీ
బేబీ మూవీతో తొలి అడుగులోనే తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నది వైష్ణవి చైతన్య. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటన యూత్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. బేబీ తర్వాత లవ్ మీ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. ఈ సినిమా కోసం సింగర్‌గా అవతారం ఎత్తిన వైష్ణవి చైతన్య ఓ పాట పాడింది.
రెండు సినిమాల్లో…
లవ్ మీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న జాక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది వైష్ణవి చైతన్య. ఆనంద్ దేవరకొండతో మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు దిల్‌రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆశీష్. లవ్ మీ అతడి సెకండ్ మూవీ ఇది. ప్రస్తుతం అగ్ర దర్శకుడు సుకుమార్ బ్యానర్‌లో రూపొందుతోన్న సెల్ఫీష్‌తో పాటు మరో మూవీ చేస్తోన్నాడు ఆశీష్.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits