Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: పేదలు ఉన్నత శిఖరాలకు చేరాలని సీఎం వైయస్ జగన్ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అనే గొప్ప నిర్ణయం తీసుకున్నారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. విదేశాలకు వెళ్లి చదవాలంటే భారీగా ఖర్చయ్యేదని, అలాంటిది ప్రభుత్వమే ఖర్చు భరించడం అదృష్టమన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెనపై మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు రూ.1.25 కోట్లు వెచ్చించి విదేశాల్లో చదువుకునే అవకాశం సీఎం వైయస్ జగన్ కల్పించారు. కాపులు, ఈబీసీల పిల్లలకు కోటి రూపాయల ఇస్తున్నారని చెప్పారు. వంద నుంచి 200 యూనివర్సిటీలకు సెలెక్ట్ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు రూ.75 లక్షలు ఇవ్వాలని, మిగిలిన ఈబీసీ, కాపు పిల్లలకు రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పేద పిల్లలు ఈ రోజు విదేశాల్లో ఉంటూ మాట్లాడుతుంటే ఎంతో ఆనందం అనిపించింది. అంబేద్కర్ ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతోంది. చదువుల విప్లవానికి తెరదీసిన సీఎం వైయస్ జగన్ ఆలోచనలు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ఉంటుందని చదువుకున్న వ్యక్తిగా ఈ నిర్ణయంతో మంత్రముగుడనైనాను. టీడీపీలో ఉన్న కొంత మంది చెబుతున్నారు..వైయస్ జగన్ విదేశీ విద్యను తీసేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మీ ప్రభుత్వంలో ఉన్న తప్పులపై టీడీపీ కాన్సంట్రేషన్ చూపకపోతే మా సీఎం వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకుని పేదల పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వబోతున్నారు. ఇది చాలా అదృష్టం. ఈ పథకాన్ని వినియోగించుకుంటే రాబోయే రోజుల్లో అనేక దేశాల్లో మన పిల్లలు చదువుకునే అవకాశం కలుగుతుందని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.