Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: 2014–19 సమయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి తండ్రీకొడుకులు రూ.250 కోట్లు దోచుకున్నమాట వాస్తవం కాదా..? సీమెన్స్ కంపెనీలతో ఒప్పందం అని 5, 6 షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీలకు రూ.250 కోట్లు తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా..? నారా లోకేష్ సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. మంగళగిరిలో ఓడిపోయిన పనికిమాలినోడు నారా లోకేష్‌కు ప్రజలందరి నాయకుడు వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా..? లోకేష్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ కాదు.. మనిషే ఫెయిల్యూర్ అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. సీమెన్స్ కంపెనీ ఒప్పందం పేరుతో జరిగిన దోపిడీపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేపట్టాలని, దోపిడీ దారులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విలేరుల సమావేశం నిర్వహించారు.