CM Revanth Reddy : కడపలో ఉపఎన్నిక వస్తే షర్మిల విజయం కోసం గల్లీ గల్లీ ప్రచారం చేస్తా – సీఎం రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024


CM Revanth Reddy : వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన నుంచి దూరమైనా… 15ఏళ్లుగా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలోని మంగళగిరిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, తెలంగాణ మంత్రులు, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారన్నారు. వైఎస్ఆర్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్ తో తనకు ప్రత్యేకమైన అనుభవం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి… మొదటిసారిగా తాను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు… వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాడ్ని అన్నారు. తాను లేవనెత్తిన అంశాలపై తనను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారన్నారు. కొత్త వారిని ప్రోత్సహిస్తే నాయకత్వం బలపడుతుందని వైఎస్ నమ్మేవారన్నారు.

బీజేపీ అంటే బాబు జగన్ పవన్

“రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట.. మాట తప్పను.. మడమ తిప్పను అనే మాట. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు షర్మిల పోషిస్తున్నారు. ప్రజల గొంతుకై షర్మిల ప్రజల తరపున మాట్లాడుతున్నారు. ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది.. బీజేపీ అంటే బాబు జగన్ పవన్. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు.. అంతా పాలకపక్షమే. బాబు.. జగన్… పవన్ అందరూ మోదీ పక్షమే. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకురాలు షర్మిల. 2029లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వారే ఆయన నిజమైన వారసులు. వైఎస్ పేరుతో రాజకీయ వ్యాపారాలు చేసేవాళ్లు ఆయన వారసులు కాదు. వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించేందుకు షర్మిల ముళ్ల బాటను ఎంచుకున్నారు. షర్మిలకు మేమంతా అండగా నిలబడతామని చెప్పేందుకే మంత్రివర్గ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చాం” – సీఎం రేవంత్ రెడ్డి

వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించే వాళ్లే నిజమైన వారసులు

కడప పార్లమెంట్ కు ఉప ఎన్నిక వస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా కడప పౌరుషాన్ని దిల్లీకి చాటే అవకాశం వస్తే… ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీ తిరగడానికి నేను వస్తానన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారని, ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలుపెడతామన్నారు. వైఎస్ఆర్ పాలన ఒక చెరగని ముద్ర అని రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 14 వందల కిలోమీటర్లు వైఎస్ఆర్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. 1999 స్ఫూర్తిని వైఎస్ షర్మిల ఏపీలో కొనసాగిస్తున్నారన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిలనే యఅన్నారు. షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుందన్నారు. కుటుంబ సభ్యులకు వారసత్వం రావడం కాదు.

ఆయన ఆశయాలను కొనసాగించే వాళ్లే నిజమైన వారసులు అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం కోసమే షర్మిల బాధ్యతలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ రావాల్సి ఉందని, కానీ మణిపూర్ లో ఉన్న పరిస్థితులు కారణంగా రాలేక పోయారన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Cm Revanth ReddyAndhra Pradesh NewsYs SharmilaYs JaganChandrababu NaiduPawan KalyanAmaravati

Source / Credits

Best Web Hosting Provider In India 2024