TG Lab Technician Grade II : తెలంగాణ గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

TG Lab Technician Grade II : తెలంగాణ గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. కమిషన్ వెబ్ సైట్ https://websitenew.tspsc.gov.in/ ఎంపికైన అభ్యర్థుల వివరాలు విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి.

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు మే 11, 2018లో రాత పరీక్ష నిర్వహించారు. సర్వీస్ వెయిటేజీ మార్కులు, అర్హత వెయిటేజీ ప్రకారం

గతేడాది ఆగస్టు 03 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 03న 2వ స్పెల్, ఏప్రిల్ 15, 16 , 25 తేదీల్లో మూడో స్పెల్ ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అభ్యర్థులు తాత్కాలిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో విజయం, అభ్యర్థిక సంబంధించి అన్ని వివరాలు పరిగణనలోకి తీసుకుని నియామకానికి అన్ని విధాలుగా సరిపోతారని, కేసు విచారణ తర్వాత అపాయింటింగ్ అథారిటీ సంతృప్తి చెందితే తప్ప అపాయింట్‌మెంట్ పొందే హక్కు ఉండదని టీజీపీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్‌కు అనుగుణంగా అభ్యర్థి అటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్‌లను సర్టిఫికెట్ల పరిశీలనలో సమర్పించాలి. 

టీజీ జేఎల్ ఫలితాలు విడుదల

తెలంగాణ జూనియర్ లెక్చరర్ల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు గతేడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే ఒక అభ్యర్థి ఫలితాన్ని విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు తెలిపింది. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో జాబితాను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. అభ్యర్థులు జూనియర్ లెక్చరర్ ఫలితాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in   లో చెక్ చేసుకోవచ్చు. జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకారం మెరిట్ తయారు చేసినట్లు టీజీపీఎస్సీ తెలిపింది.

టీజీపీఎస్సీ జేఎల్ మెరిట్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీఎస్పీఎస్సీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL Jobs) ఉద్యోగాల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1392 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి జేఎల్‌ పోస్టుల నోటిఫికేషన్‌ ఇది. చివరిగా ఉమ్మడి ఏపీలో 2008లో నోటిఫికేషన్‌ జారీ అయింది. అనేక కారణాలతో ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు. అప్పుడు తెలంగాణలో సుమారు 457 జేఎల్‌ పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత గతేడాది జేఎల్ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsExamsExam ResultsTspscTrending TelanganaJobs
Source / Credits

Best Web Hosting Provider In India 2024