Siddharth: ఇది ఒక యాంటీ వైరస్ లాంటిది.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో సిద్ధార్థ్

Best Web Hosting Provider In India 2024

Siddharth About Bharateeyudu 2: లోకనాయకుడు కమల్ హాసన్, హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భారతీయుడు 2. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 12న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భారతీయుడు 2 ప్రెస్ మీట్ నిర్వహించారు.

మంచి స్టూడెంట్స్ మేము

ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు హీరో సిద్ధార్థ్ కంటతడి పెట్టారు. అలాగే జయసుధ కామెంట్స్‌కు తాను చాలా ఎమోషనల్ అయినట్లు చెప్పుకొచ్చాడు హీరో సిద్ధార్థ్. తాను, సిద్ధార్థ్ ఏకలవ్య శిష్యులం అని, తమకు కనిపించని గురువు ఉంటారని, తాము ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకున్న మంచి స్టూడెంట్స్‌ అని కమల్ హాసన్ చెప్పారు. దానికి సిద్ధార్థ్ కంటతడి పెట్టుకున్నారు.

అప్డేటెడ్ యాంటీ వైరస్

అలాగే భారతీయుడు 2 ప్రెస్ మీట్‌లో హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “భారతీయుడు 2 నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. సమాజంలో ఉన్న కరప్షన్‌ను చూసి కోపం వస్తూనే ఉంటుంది. భారతీయుడు 2 అనేది ఓ యాంటీ వైరస్ లాంటిది. సమాజంలోని వైరస్‌ను తీసేందుకు శంకర్ గారు తీసుకొచ్చిన అప్డేటెడ్ యాంటి వైరస్ ఈ మూవీ” అని సిద్ధార్థ్ తెలిపారు.

కమల్ హాసన్‌తో పోల్చారు

“కమల్ హాసన్ గారు నాకు ఇష్టమైన హీరో. జయసుధ గారు నన్ను కమల్ హాసన్ గారితో పోల్చారు. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎమోషనల్‌గా అనిపించింది. ఇక ఈ చిత్రంలో నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ గారికి థాంక్స్” అని హీరో సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.

20 ఏళ్లు ఇలాగే గడిపేస్తా

“ఓ క్రిష్టోఫర్ కొలంబస్‌లా శంకర్ గారు నన్ను కనిపెట్టి హీరోగా తీసుకొచ్చారు. మళ్లీ 20 ఏళ్ల తరువాత అవకాశం ఇచ్చారు. నా ఫస్ట్ 20 ఏళ్ల కెరీర్ బాయ్స్‌తో గడిపేశా.. రాబోయే 20 ఏళ్లు భారతీయుడు 2తో గడిపేస్తా. యువత ఈ సమాజం కోసం ఏం చేయాలో చెప్పే చిత్రం అవుతుంది. జూలై 12న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని సిద్ధార్థ్ అన్నారు.

కలలో కూడా అనుకోలేదు

బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. “భారతీయుడు సినిమా సీక్వెల్‌లో నేను నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. కమల్ హాసన్ సర్‌తో పని చేయడం అంటే కల నెరవేరినట్టే. సిద్దార్థ్‌తో నటించడం ఆనందంగా ఉంది. యూనిట్ అంతా కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశాం. సురేష్ బాబు గారు ఈ సినిమాను భారీ ఎత్తున జూలై 12న విడుదల చేస్తున్నారు. అందరూ తప్పకుండా చూడండి” అని చెప్పింది.

సినిమాకు ఇంకో పేరు

“భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇండియన్ కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ గారికి థాంక్స్. సినిమాకు ఇంకో పేరు అంటే అది కమల్ హాసన్ గారు మాత్రమే. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి” అని తమిళ పాపులర్ యాక్టర్ బాబీ సింహా తెలిపారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024