Brahmamudi July 10th Episode: బ్రహ్మముడి- రాజ్ కావ్య ప్లాన్ సక్సెస్- అప్పుకు భార్యను చంపినవాడితో పెళ్లి- మారిపోయిన అపర్ణ

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో సుభాష్, అపర్ణ మ్యారేజ్ యానివర్సరీ అని రాజ్ ఫోన్‌కు రిమైండర్ వస్తుంది. ఇది నేను మర్చేపోయాను అని సంతోషంతో రాజ్ అంటాడు. కానీ ఈ రిమైండర్ ఎవరు పెట్టారు అని రాజ్ అంటే.. నేనే పెట్టాను. టెక్నాలజీ ఉంది వాడుకోడానికే అని కావ్య అంటుంది. ఇద్దరూ కాసేపు ఆలోచించి.. ఒక పని చేస్తే అని ఒకేసారి అంటారు.

 

గేమ్స్ పెడదాం

నీకు కూడా అదే ఐడియా వచ్చిందా అని రాజ్ అడిగితే.. ముందు మీకేం వచ్చిందో చెప్పమని కావ్య అంటుంది. రేపు మ్యారేజ్ యానివర్సరీని చాలా గ్రాండ్‌‌గా చేద్దాం. కల్యాణ్‌ను బాధ నుంచి తప్పించొచ్చు అని రాజ్ అంటాడు. దీన్ని పెద్ద పండుగల చేయాలి. గేమ్స్ పెడదాం. కవి గారిని కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేద్దాం అని కావ్య అంటుంది. దాంతో ఇద్దరూ సరే అనుకుంటారు. నాకు మంచి ఆలోచన వచ్చింది కదా అని రాజ్ అంటే.. కావ్య సెటైర్లు వేస్తుంది.

మరోవైపు చుట్టు పక్కల వాళ్లు అన్న మాటలు గుర్తు చేసుకుని కనకం బాధపడుతుంది. అది చూసి కృష్ణమూర్తి నచ్చజెపుతాడు. రెండు కుక్కల కథ చెప్పి దేన్ని ఎక్కువగా నమ్ముతావో అదే బలపడుతుందని అంటాడు కృష్ణమూర్తి. అప్పుకు పెళ్లి చేద్దామా. నేను ఆవేశంతో అనట్లేదు. ఆలోచించే అంటున్నాను అని కనకం అంటుంది. తను పోలీస్ అవడానికి చాలా కష్టపడుతుంది. అలా అని లేట్ చేస్తే తన జీవితం ప్రశ్నగా మారిపోతుంది అని కృష్ణమూర్తి అంటాడు.

అప్పును ఎలా ఒప్పిస్తావ్

అందుకే పెళ్లి చేద్దాం అంటున్నా. నీకు తెలిసిన పేరయ్య దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయంటూ తిరిగేవాడు కదా అని కనకం అంటుంది. తల్లిగా నువ్ పడే బాధలో న్యాయం ఉంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో అప్పును ఎలా ఒప్పిస్తావ్ అని కృష్ణమూర్తి అడుగుతాడు. అదంతా నేను చూసుకుంటాను. ముందైతే నువ్ మాట్లాడమని కనకం అంటుంది. సరే రేపు మాట్లాడుతాను. నువ్ ఇక కంగారుపడకు అని కృష్ణమూర్తి వెళ్లిపోతాడు.

 

కట్ చేస్తే.. సుభాష్ బయటకు వస్తే.. రాజ్ కావ్య పెళ్లి రోజులు శుభాకాంక్షలు చెబుతారు. అసలు ఈ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే అపర్ణకు విషెష్ చెబుతాను అని సుభాష్ అంటాడు. ఇలా ఒట్టి చేతులతో చెబుతారా డాడ్ అని రాజ్ అంటాడు. మీరు ఇలా ఉన్నారు కాబట్టే.. మీ కొడుకు ఇలా ఉన్నారు అని సెటైర్లు వేస్తుంది. రాజ్ కావ్య పోట్లాడుతారు. దాన్ని నన్నేం చేయమంటారో చెప్పండని సుభాష్ అంటాడు. తర్వాత ఓ గిఫ్ట్ తీసి అత్తయ్యకు పసుపు రంగు చాలా ఇష్టం. ఇది మీరు ఇచ్చినట్లుగా గిఫ్ట్ ఇవ్వండి అని కావ్య అంటుంది.

మనవడిని ఎప్పుడు ఇస్తావ్

సరే అని గిఫ్ట్ తీసుకున్న సుభాష్ అపర్ణ అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడతాడు. ఏం ఆలోచించకుండా చెప్పేయండి అని రాజ్ అంటాడు. దాంతో సుభాష్ వెళ్లిపోతాడు. ఇక ఆ క్రెడిట్ అంతా తమదే అని రాజ్ కావ్య పొట్లాడుతుంటారు. దాంతో ఇందిరాదేవి వచ్చి గండుపిల్లుల్లా కొట్లాడుతున్నారు. ఎప్పుడు మీరు కలిసేది. నాకు మనవడిని చేతిలో పెట్టేది ఎప్పుడు అని ఇందిరాదేవి అంటుంది. అది మీ మనవడినే అడగండి అని కావ్య వెళ్లిపోతుంది.

 

చూశావా ఎలా మాట్లాడుతుందో అని రాజ్ అంటాడు. భార్య అన్నాక అలాగే ఉంటుందని ఇందిరాదేవి అంటే.. నువ్ కూడా తాతయ్యతో ఇలాగే ఉండేదానివా అని రాజ్ అడుగుతాడు. అవును, మీ తాతయ్య ఏమైనా పైనుంచి ఊడిపడ్డాడా.. అలిగితే బుజ్జగించేవాడు, కోపం వస్తే భరించేవాడు, తిడితే పడేవాడు. ఆడదానికి కొంచెం మొహమాటం అడ్డు వస్తాయిరా. నువ్ ఒక అడుగు ముందుకేయాలి అని ఇందిరాదేవి అంటుంది. సరే ఇవాళ నా మనసులో మాట చెప్పేస్తాను అని రాజ్ అంటాడు.

భార్యగా గెలిచావ్

మరోవైపు అపర్ణ దగ్గర సుభాష్ గిఫ్ట్ పట్టుకుని మాట్లాడుతాడు. నా మీద నీకు కోపం ఉందని, నేను ఏమిచ్చిన తీసుకోవని. అలా అని భర్తగా నేను చేయాల్సింది చేయకపోతే అది కూడా తప్పే కదా. నేను చేసింది తప్పే. అందుకే కోపంగా ఉన్నావ్. కానీ, నా విషయంలో నువ్ ఏ తప్పు చేయలేదు. నువ్ అన్ని సక్రమంగా చేసి భార్యగా గెలిచావ్. అందుకే ఈ బహుమతి ఇస్తున్నా. నా జీవితంలోకి వచ్చే నాకు సంతోషాన్ని ఇచ్చావ్ అని హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని గిఫ్ట్ తీసి ఇస్తాడు సుభాష్.

కాస్తా ఆలోచించినా అపర్ణ.. ఆ గిఫ్ట్ తీసుకుంటుంది. దాంతో సంతోషపడిన సుభాష్ థ్యాంక్యూ అని చెప్పేసి బయటకు వస్తాడు. బయట రాజ్‌ను హగ్ చేసుకుని నువ్ ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు కొంచెం అనుమానం ఉండేది. ఇప్పుడు అంతా బాగుంది. చాలా సంతోషంగా ఉందని సుభాష్ అంటాడు. ఇవాళ మీ పెళ్లి రోజు చాలా గ్రాండ్‌గా చేద్దాం అని రాజ్ అంటాడు. మరోవైపు కనకం ఇంటికి పేరయ్య ఓ వ్యక్తిని తీసుకొస్తాడు.

 

భార్యను చంపి జైలుకు

అది చూసి కనకం, కృష్ణమూర్తి షాక్ అవుతారు. మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పారు కదా అని పనిలో పని ఇతన్ని తీసుకొచ్చానని పేరయ్య అంటాడు. మంచి సంబంధం అన్నాం. ఇలాంటివాడిని తీసుకొస్తారా అని కనకం అంటుంది. అప్పుడే బయటకు వచ్చిన అప్పు అది చూస్తుంది. నాకేం తక్కువ అని అతను అంటాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నావ్. పెళ్లాన్ని చంపి జైలుకు కూడా వెళ్లావ్ అని కనకం అంటుంది. అయితే ఏంటీ సారా వ్యాపారంలో బాగా సంపాదించాను కదా అని అతను అంటాడు.

ఎందుకు తలమీద పెట్టుకోడానికా అని కనకం అంటుంది. మీకు డబ్బున్న వాళ్లు దొరికితే పెళ్లి చేస్తారు కదా. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు. అయినా మీ అమ్మాయి లాడ్జ్‌లో దొరికింది కదా. ఇంకా నేను చాలా మంచి వాడిని కాబట్టి పెళ్లి చేసుకుందామనుకున్నా. బయట ఏం అనుకుంటున్నారో మీకు తెలియదు. మీ అమ్మాయికి నేనే కరెక్ట్. ఓ తిరుగుబోతుకి నాలాంటి తిరుగుబోతే కరెక్ట్ అని అతను అంటాడు. దాంతో అతని చెంప వాయిస్తుంది కనకం.

బయటకు గెంటేసిన కనకం

నీతో నా కూతురుకి పోలిక ఏంట్రా. నా కూతురు నిప్పు. నీలాంటి అడ్డమైన వాళ్లు నా కూతురుకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని బయటకు గెంటేస్తుంది కనకం. నేనేం మనసులో పెట్టుకోను గానీ మీ మనసు మారితే కబురు పెట్టండని ఆ రౌడీ వెళ్లిపోతాడు. ఇలాంటి సంబంధమా మీరు తీసుకొచ్చేదని పూజారిపై కృష్ణమూర్తి ఫైర్ అవుతాడు.

 

మీరు ఏమనుకోనంటే.. ఓ విషయం చెబుతాను. మీ మనిషిలా చెబుతాను. ఇన్ని గొడవలు జరిగాక బయట సంబంధం తీసుకురావడం మంచిది కాదమ్మా. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత అనుమానిస్తాడు. తెలిసే తెలియక మీ అమ్మాయి తిరిగింది. అంతా తప్పుగా చూస్తున్నారు. ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడమే ఉత్తమం అని పూజారి అంటాడు. మీ పని చూడటం. సలహాలు ఇవ్వడం కాదని కనకం అంటుంది. సరేనమ్మా సంబంధాలు చూస్తాను అని పంతులు వెళ్లిపోతాడు.

సంవత్సరం కాకముందే

కనకం వెనక్కి తిరగ్గానే అప్పు ఉంటుంది. కన్నీళ్లతో అప్పు లోపలికి వెళ్లిపోతుంది. అది చూసి కనకం బాధ పడుతుంది. మరోవైపు కల్యాణ్ ఒంటరిగా ఉంటే.. చూశావా నీ వల్ల వాడు బాధపడుతున్నాడు అని ప్రకాశం అంటాడు. ఇంత జరిగిన అప్పు గురించే ఆలోచిస్తుంటే ఎలా అని ధాన్యలక్ష్మీ అంటుంది. పెళ్లై సంవత్సరం కాకముందే విడాకులు ఇచ్చాడు. వాడి వైపు నుంచి ఆలోచించి తల్లిగా వాడిని ఓదార్చుపో అని ప్రకాశం అంటాడు.

రాత్రి కొంచెం ఆవేశంగా మాట్లాడాను. ఏమనుకోకు అని ధాన్యలక్ష్మీ అంటుంది. తల్లివి కదా అర్థం చేసుకున్నాను. అందుకే మౌనంగా వెళ్లిపోయాను అని కల్యాణ్ అంటాడు. నువ్ ఇలా కాదు. ఎప్పటిలా మాములు మనిషిలా ఉండు. వయసుకొచ్చిన కొడుకు ఇలా ఉంటే చాలా బాధగా ఉంటుంది. నీకు ఏది చేయాలనిపిస్తే చేయి.. ఆఫీస్‌కి వెళ్లాలనిపిస్తే వెళ్లు.. నచ్చింది చేయు. మేము సపోర్ట్ చేస్తాం.. నువ్ ఇలా బాధపడుతుంటే మా వాళ్ల కావట్లేదు. ఎప్పటి మనిషిలా ఉండురా అని ధాన్యలక్ష్మీ, ప్రకాశం వెళ్లిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

 

నిన్నే ప్రేమిస్తానంటూ

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో గేమ్స్ ఆడుతుంటారు. పెద్దమ్మ మనసులో ఏముందో పెద్దనాన్న చెప్పాలి అని కల్యాణ్ అంటాడు. మీకు నానమ్మ చెవిలో ఒకటి చెబుతుంది. దాన్ని సైగలతో చేసి చూపిస్తే అదేంటో పెద్దనాన్న చెప్పాలని కల్యాణ్ చెబుతాడు. దాంతో ఇందిరాదేవి దగ్గరికి అపర్ణ వెళ్తే.. చెవిలో నిన్నే ప్రేమిస్తా అని చెబుతుంది. అది సైగలతో అపర్ణ చెబితే సుభాష్ కరెక్ట్‌గా గెస్ చేసి చెబుతాడు. అంతా సంతోషిస్తారు.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024