
Best Web Hosting Provider In India 2024

Case Filed On Raj Tarun : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సహ జీవనం చేసిన తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఫిర్యాదుతో పోలీసులు 420, 506, 493 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. హీరో రాజ్‌తరుణ్, తాను 2012 నుంచి ప్రేమించుకుంటున్నామని, కొన్ని రోజులు ఒక గదిలో ఉంటూ సహజీవనం చేశామని, ఇటీవల ఓ సినీనటితో రాజ్ తరుణ్ సన్నిహితంగా ఉంటున్నాడని లావణ్య నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. అనంతరం అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. లావణ్య డ్రగ్స్ కు అలవాటు పడి తనను వేధించేదని రాజ్ తరుణ్ ఆరోపించారు.
అబార్షన్ చేయించారు
తాజాగా మరో విషయాన్ని లావణ్య బయటపెట్టింది. 10 ఏళ్ల క్రితమే తమకు వివాహం అయ్యిందని, ఇద్దరం కలిసే జీవిస్తున్నామని చెప్పింది. దీంతో పాటు కొన్నాళ్ల క్రితం తనకు అబార్షన్ కుడా చేయించారని తెలిపింది. మరో సినీ నటితో సంబంధం కొనసాగిస్తూ రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని లావణ్య ఆరోపిస్తుంది. తనను సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉన్నానని వాపోయింది. రాజ్ తరుణ్ తనను మారుపేరుతో విదేశాలకు తీసుకెళ్లారని లావణ్య ఆధారాలను పోలీసులకు చూపించారు. లావణ్య ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్