బాలిక హత్యోదంతంపై చలనం లేని హోంమంత్రి 

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఫైర్‌

విశాఖ‌: బాలిక హత్యోదంతంపై హోం మంత్రి అనిత‌కు చలనం లేద‌ని, మహిళల రక్షణ ఇలాగేనా అని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ప్ర‌శ్నించారు. పదమూడేళ్ల బాలిక దర్శినిని దారుణంగా హత్యచేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లేపల్లి సుభద్ర  బుధవారం వారిరువురు రాంబిల్లి మండలం  కొప్పుగొండుపాలెంలోని దర్శిని ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను  ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన లేఖను డీఎస్పీకి అందజేశారు. 

రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత జిల్లాకు చెందిన బాలికను హత్యచేసి ఐదురోజులైనా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కళ్యాణి, సుభద్ర  ప్రశ్నించారు. బెయిల్‌పై ఉన్న నిందితుడు సురేష్‌ నుంచి ప్రాణహాని ఉందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా బాలికను రక్షించలేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా చట్టాలు, మహిళల రక్షణ గురించి మాట్లాడిన అనిత ఇప్పుడేం చేస్తున్నారని.. మహిళల రక్షణ ఇలాగేనా అని వారు ప్రశ్నించారు. 

ఇప్పటివరకూ బాలిక కుటుంబీకుల్ని పరామర్శించేందుకు హోంమంత్రి రాకపోవడం దారుణమన్నారు. దిశ యాప్, దిశ పోలీస్‌స్టేషన్లను మార్చడంలో ఉన్న శ్రద్ధ మహిళలను రక్షించడంలో ఎందుకు లేదన్నారు. మృతురాలి కుటుంబీకులకు ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని  డిమాండ్‌ చేశారు.  బాలిక హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు.   

Best Web Hosting Provider In India 2024