Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని, శాసనమండలి స్థానాలలో బడుగు బలహీనవర్గాల అభ్యర్థులకు ప్రాధాన్యతనివ్వడం గొప్ప వరంగా భావిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ‘నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ’ అనేది నినాదం కాదని.. అది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమని తేటతెల్లమైందన్నారు. బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులుగా తామంతా ఒకటే అనుకుంటున్నామని, ఇన్నాళ్లూ రాజ్యాధికార సాధనకు నానాపాట్లు పడే తమకు వైయస్ జగన్ నాయకత్వంలో ఒక భరోసా దొరికిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు జగనన్న రూపంలో తమకో ధైర్యం కనిపించిందన్నారు. అణగారినవర్గాల ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మార్గాని భరత్ విలేకరుల సమావేశం నిర్వహించారు.