Best Web Hosting Provider In India 2024
Akshay Kumar Sarfira: అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీకి పెద్ద షాక్ తగిలింది. అక్షయ్ కుమార్ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ ఎఫెక్ట్ ఈ మూవీపై గట్టిగా పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ వైడ్‌గా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జీరో లెవెల్‌కు పడిపోయాయి. ఈ సినిమా రిలీజైన చాలా థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు.
1800 టికెట్లు…
ఓవరాల్‌గా నేషనల్ వైడ్‌గా అన్ని మల్టీప్లెక్స్‌లలో కలిపి జూలై 11 వరకు 1800 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు థియేటర్ వర్గాలు తె లిపాయి. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా కేవలం 30 లక్షలు మాత్రమే రాబట్టినట్లు చెబుతోన్నారు. అక్షయ్ కుమార్ కెరీర్లోనే అతి తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన మూవీగా సర్ఫిరా చెత్త రికార్డును మూటగట్టుకుంది.
హైదరాబాద్‌లో వందలోపే…
హైదరాబాద్‌లో సర్ఫిరా ఏఫెక్ట్ ఏ మాత్రం లేదు. పోటీగా భారతీయుడు 2 మినహా పెద్ద సినిమాలు ఏవి లేకపోయినా అక్షయ్ మూవీని చూడటానికిఆడియెన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. జూలై 11 వరకు హైదరాబాద్‌లో వంద లోపు మాత్రమే టికెట్లు అమ్ముడుపోయాయి. శుక్రవారం రోజు ఉదయం ఆటకు చాలా థియేటర్లు బుకింగ్స్ లేకుండా ఖాళీగా దర్శనమిస్తోన్నాయి.
యూట్యూబ్ లో మూవీ…
అడ్వాన్స్ బుకింగ్స్ లేక సతమతమవుతోన్న సర్ఫిరా మేకర్స్‌కు గోల్డ్ మైన్ టెలి ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్ వారు షాకిచ్చారు. సూర్య (Suriya) హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన సూరారై పొట్రు రీమేక్‌గా సర్ఫిరా మూవీ రూపొందింది.
సూరారై పొట్రు హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానెల్ సొంతం చేసుకున్నది. సర్ఫిరా థియేటర్లలో రిలీజైన శుక్రవారం రోజే గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానెల్ సూరారై పోట్రు హిందీ డబ్బింగ్ మూవీని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఒకేరోజు అటు థియేటర్లలో అక్షయ్ కుమార్ మూవీ…యూట్యూబ్‌లో సూర్య సూరారై పొట్రు హిందీ డబ్బింగ్ మూవీ రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది.
కల్ట్ క్లాసిక్ మూవీ…
సూరారై పొట్రు హిందీ వెర్షన్ ఉడాన్ పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో కూడా అందుబాటులో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సూర్య సినిమాను చాలా మంది చూసేశారు. అందువల్లే సర్ఫిరాకు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేవని సమాచారం.
ఐదు నేషనల్ అవార్డ్స్…
సర్ఫిరా సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించింది. ఈ మూవీతోనే ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పరేష్ రావెల్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. రాధికా మదన్ హీరోయిన్గా నటించింది. ఈ బాలీవుడ్ మూవీలో సూర్య గెస్ట్ రోల్లో కనిపించాడు.
ఈ మూవీకి సూర్య సతీమణి జ్యోతిక ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. కాగా కొవిడ్ కారణంగా సూరారై పొట్రు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీ ఐదు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నది.