Indian 2 OTT: భారతీయుడు 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఏ రోజు నుంచి అంటే?

Best Web Hosting Provider In India 2024

Indian 2 OTT Release: యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా భారతీయుడు 2/ ఇండియన్ 2. కోలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెరకెక్కించిన ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పతాకాలపై ప్రముఖ నిర్మాత సుభాస్క‌ర‌న్ నిర్మించారు.

అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందిన భార‌తీయుడు 2 ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న అంటే ఇవాళ చాలా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీని తెలుగులో ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్‌లో శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు విడుదల చేశాయి. ఎన్నో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.

సుమారు 27 ఏళ్ల క్రితం కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఇండియన్ 2పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే ఇన్ని అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. సినిమాలో కమల్ హాసన్ నటన అదిరిపోయినప్పటికీ మళ్లీ అదే రొటీన్ సబ్జెక్ట్‌ను శంకర్ తీసుకొచ్చారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అవుట్ డేటెడ్ స్టోరీతో మూడు గంటల పాటు సినిమాను సాగదీశారని నెగెటివ్ టాక్ వస్తోంది. అలాగే కమల్ హాసన్ వేసిన గెటప్స్ కొన్ని అంతగా సూట్ కాలేదని చెబుతున్నారు. ఇకపోతే చిత్రాన్ని మాత్రం భారీ నిర్మాణ విలువలతో రిచ్‌గా తెరకెక్కించారని అంటున్నారు. అయితే తొలి రోజు పూర్తి అయ్యేవరకు ప్రేక్షకులు భారతీయుడు 2పై ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి. కలెక్షన్స్ అండ్ మౌత్ టాక్‌ను బట్టి ఇండియన్ 2 ఎలా ఉందో ఒక్కరోజు గడిస్తే తెలిసిపోతుంది.

ఇదిలా ఉంటే, ఇవాళ భారతీయుడు 2 థియేట్రికల్ రిలీజ్ నేపథ్యంలో ఇండియన్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. భారతీయుడు 2 చిత్రం ఏ ఓటీటీలోకి రానుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను టైటిల్ ఎండ్ కార్డ్స్‌లో మేకర్స్ రివీల్ చేసేశారు.

భారతీయుడు 2 సినిమా ఓటీటీ హక్కులకు దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. అందుకు ఇండియిన్ 2 నిర్మాతలకు నెట్‌ఫ్లిక్స్ భారీగానే ముట్టజెప్పిందని సమాచారం. భారతీయుడు 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అని దాదాపుగా ఖరారు అయింది. ఇక ఈ సినిమాను ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సుమారు 4 నుంచి 8 వారాల తర్వాతే అంటే 2 నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.

అయితే, బ్లాక్ బస్టర్ లేదా యావరేజ్ లేక డిజాస్టర్ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ చెప్పడం ఈ మధ్య కష్టంగా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటి ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ రాదు. అలాగే ఇండియన్ 2 సినిమాను టాక్ పరంగా, కలెక్షన్స్ పరంగా చూసి ఓటీటీ రిలీజే చేయనున్నారు. ఆ రకంగా ఇండియన్ 2 సినిమా నెల నుంచి 2 నెలల మధ్యలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

అంటే, ఆగస్ట్ రెండో వారం నుంచి సెప్టెంబర్ నెల గ్యాపులో భారతీయుడు 2 డిజిటల్ ప్రీమియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇండియన్ 2 చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా 5 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024