Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/07/Brahmamudi_July_13th_Episode_1720837388376_1720837402192.jpg)
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో దగ్గిరాల ఇంట్లో అపర్ణ-సుభాష్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేన్స్ రెండో రోజు కూడా జరుగుతుంటాయి. కల్యాణ్ కేక్ రెడీ అని తీసుకొస్తాడు. పనిమనిషి శాంతను పిలిచి జ్యూసులు రెడీనా అని రుద్రాణి అంటుంది. దాంతో పనిమనిషి అపర్ణ ఇచ్చిన చీర కట్టుకుని వస్తుంది. సుభాష్ గిఫ్ట్‌గా ఇచ్చిన చీరను పనిమనిషి కట్టుకుని రావడంతో చూసి సుభాష్, కావ్య, రాజ్ షాక్ అవుతారు.
ఖరీదైన చీర ఎక్కడిది
గదిలోనుంచి అపర్ణ సైలెంట్‌గా వస్తుంది. పనిమనిషి అందరికి జ్యూసులు ఇస్తుంది. ఏంటే నీకు ఇంత ఖరీదైన చీర ఎక్కడిదే అని రుద్రాణి అడుగుతుంది. ఇవాళ పెళ్లి రోజు అని అమ్మగారే ఇచ్చి, డబ్బులు కూడా పెట్టారని పనిమనిషి చెబుతుంది. ఎప్పుడు లేనిది ఇవాళే చీర ఇవ్వడం ఏంటీ అని రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. ఈసారి నేనే ఇచ్చాను. ఏ అని అపర్ణ అంటుంది. తర్వాత కేక్ కట్ చేద్దామని ఇందిరాదేవి చెబుతుంది.
సుభాష్ మాత్రం వెళ్లిపోవాలని చూస్తే రాజ్ ఆపుతాడు. వెళ్లకండి. నవ్వండి ప్లీజ్ అని తీసుకొస్తాడు. అందరూ విషెస్ చెబుతారు. అపర్ణ సుభాష్ కేక్ కట్ చేసేందకు అపర్ణ తటపటాయిస్తుంది. తర్వాత ఇద్దరూ కట్ చేసేందుకు రెడీ అవుతారు. మా అన్నయ్య అదృష్టం భలే ఉంది. మాయ మాయలో పడి తప్పు చేసిన మా వదిన భూదేవిలా అదంతా మనసులో పెట్టుకుని క్షమించింది. ఇది మా వదిన గొప్పదనంతోపాటు మా అన్నయ్య అదృష్టం అని రుద్రాణి అంటుంది.
గుర్తు చేయాల్సిన విషయమా
అపర్ణ అత్త చేతిలో ప్లాస్టిక్ కత్తి ఉంది కాబట్టి బతికిపోయారు. లేకుంటే నా సామిరంగా అని స్వప్న అంటే.. రాహుల్ జస్ట్ షటప్ అని వారిస్తాడు. నువ్ అసలు మనిషివేనా. ఏది అనకుండా ఉండకుంటే నీ నోరు ఊరుకోదా. పాల కుండలో విషం చుక్క వేసినట్లు అందరూ సంతోషంగా ఉంటే తట్టుకోలేవు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది. అది గుర్తు చేయాల్సిన విషయమా అని ఇందిరాదేవి అంటుంది. అది మీకు ఎందుకు గుర్తుకు వచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారని తట్టుకోలేకపోతున్నారా అని కావ్య అంటుంది.
నువ్ నీ కాపురం కూల్చుకుని వచ్చి అందరూ సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నావ్ అని ప్రకాశం అంటాడు. మా వదిన గొప్పదనం గురించి, విశాల హృదయం గురించి చాటి చెబుతున్నాను అని తప్పా అన్నయ్యా అని రుద్రాణి అంటుంది. నీతో పొగిడించుకోడానికి అక్క ఏం రెడీగా లేదు గానీ నోరు మూసుకో అని ధాన్యలక్ష్మీ అంటుంది. సరే అదంతా వదిలేయండి. రుద్రాణి మాటలు కొత్త. మనమంతా సంతోషంగా ఉన్నాం కదా అది చాలని అపర్ణ అంటుంది.
మీరే నాలోకం అనుకున్నా
తర్వాత ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. కేక్‌ను సుభాష్‌కు పెట్టినట్లే పక్కన ఉన్న రాజ్‌కు పెడుతుంది అపర్ణ. అంతా షాక్ అయి చూస్తారు. రాజ్ పుట్టిన తర్వాతే నా జీవితానికి సార్థకత వచ్చినట్లు అనిపించింది. అందుకే రాజ్‌కే మొదటగా తినిపించాలని అనిపించిందని అపర్ణ చెబుతుంది. అంతా చప్పట్లు కొడుతారు. వాళ్లిద్దరికి కేక్ పెట్టి రాజ్ కావ్య విషెస్ చెబుతారు. కట్ చేస్తే గదిలో ఏమైందని సుభాష్ అడుగుతాడు. నేనిచ్చిన చీర పనిమనిషికి ఇవ్వడం ఏంటని సుభాష్ అడుగుతాడు.
చేసిన పని ద్వారా అర్థం చేసుకోవచ్చు. చెప్పాల్సిన అవసరం ఉండదని అపర్ణ ఉంటుంది. చేసిన తప్పు ఒప్పుకుంటే కొంతమంది క్షమిస్తారు. పశ్చాత్తాప పడితే కొంతమంది, పరిహారం చెల్లిస్తే మరికొంత మంది క్షమించారు. కానీ, క్షమించనివారంటూ లోకంలో ఉండరని సుభాష్ అంటాడు. మొన్నటివరకు మీరే నా లోకం అనుకున్నాను. నా జీవితంలో మొదటిసారి మోసం చూశాను. సౌభాగ్యాన్ని ఇంకొకరితో పంచుకుని చీర కొనిస్తే ఏ భార్య అయినా క్షమిస్తుందా. ఆ మగ అహంకారినికి తలవంచే ప్రసక్తే లేదు అని అపర్ణ అంటుంది.
ఇది ఆత్మగౌరవం
ఇది అహంకారం కాదని సుభాష్ అంటాడు. చీర ఎందుకు కట్టుకోలేదని అడుగుతున్నారు. మీరు ఏం చేసిన నేను ఊరుకోవాలని అనుకోవడం అహంకారం కాదా. మీరు ఏం చేసిన క్షమించలేనని అంటున్నాను. ఇక మీరు వెళ్లిరండి అని అపర్ణ కోపంగా చేతులతో దండం పెడుతుంది. మనం భార్యాభర్తలుగా అందరిముందు నటించి సంతోషం ఇస్తున్నాను. దీన్ని ఆత్మ గౌరవం అంటారు. ఈ ఇంటి పెద్ద కోడలినైనా నాకు అ గౌరవం లేకుండా చేశారు అని అపర్ణ అంటుంది.
ఏం చేస్తే అని సుభాష్ అంటే.. ఏం చేయలేరు. ఈ వయసులో తాత్కాలిక సుఖం కోరుకున్నారు. అందుకే శాపం తగిలిందని అపర్ణ అంటుంది. నేను ఇంత మాట్లాడుతున్న నా మొహం చూడట్లేదంటే నా మొహం చూడటానికే ఇష్టపడట్లేదని అర్థమవుతోందని సుభాష్ అంటాడు. అశోకవనంలో సీతతో రావణాసురుడుతో మాట్లాడితే గడ్డి పరకకు సమాధానం ఇచ్చింది. నేను అలా తీసిపారేయలేక నా ఐదో తనమైన గాజులకు సమాధానం చెబుతున్నాను అని అపర్ణ అంటుంది. దాంతో సుభాష్ వెళ్లిపోతాడు.
ఎవరు నటిస్తున్నారు
బయట రాజ్ కావ్యను చూసి షాక్ అవుతాడు. మమ్మీ ఎందుకు వెళ్లిపోయింది. ఏం జరుగుతోందని రాజ్ అడుగుతాడు. తను చాలా సంతోషంగా ఉంది. అన్ని ఎంజాయ్ చేస్తుందని కవర్ చేస్తాడు సుభాష్. మీరు అలా అయితే మీరు పెళ్లి రోజు కానుకగా ఇచ్చిన చీరను పనిమనిషికి ఎందుకు ఇచ్చారు మావయ్య అని కావ్య అడుగుతుంది. మీలో ఎవరు నటిస్తున్నారు అని రాజ్ అడుగుతుంది. తెలుసుకుని ఏం చేస్తావని సుభాష్ అంటాడు. మారడానికి ప్రయత్నించొచ్చు అని రాజ్ అంటాడు.
మారనని చెబితే. అయినా అది మీకు అనవసరం. మా భార్యాభర్తల మధ్య విషయం అని సుభాష్ అంటాడు. కాదు. నా తల్లిదండ్రులకు సంబంధించిన సమస్య కూడా, దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలి పెద్ద కొడుకు సమస్య. అది ఎలా వదిలేయగలం అని రాజ్ అంటాడు. నేను మాయతో చేసింది మీ అమ్మ ఇంకా క్షమించలేకపోతుంది. అందుకే చీర తనకు ఇచ్చింది. నేను తప్పు చేస్తున్నాను. తన కోపాన్ని అర్థం చేసుకోగలను అని సుభాష్ అంటాడు.
మనశ్శాంతి లేకుండా బతకండి
మాయను తీసుకొచ్చి నిలబెట్టిన కలవలేదంటే ఇంతే అని చేతులు కట్టుకుని కూర్చోవాలా అని రాజ్ అంటాడు. వద్దురా.. మూలాలు వెతుక్కుంటూ వెళ్లండి. మార్గాలు కనుక్కుంటూ వెళ్లండి.. మీ గురించి మాత్రం ఆలోచించకండి.. కొన్నాళ్లు రాహుల్ స్వప్న.. మరికొన్నాళ్లు అనామిక కల్యాణ్‌ను కలిపేందుకు తిరిగారు. తర్వాత మాయను, అసలు మాయ సమస్య పరిష్కరించారు. అన్ని సమస్యలు తలపై వేసుకుని, అందరి బాధలు మీద వేసుకుని మనశ్శాంతి లేకుండా బతకండ్రా అని సుభాష్ కోప్పడతాడు.
మావయ్య అని కావ్య అంటే.. వద్దమ్మా.. మీ సహనాన్ని పరిక్షించే సహనం నాకు లేదు. మా కాపురం సంగతి మేము చూసుకుంటాం. మేము అన్ని దశలు చూశాం. మీరు ఇంకా తొలి దశలోనే ఉన్నారు. ఎందుకు అన్ని తలపై పెట్టుకుంటారు. నా కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. శిక్ష అనుభవించే అర్హత నాకే ఉందు. కనీసం మీరైనా సంతోషంగా ఉండండ్రా అని సుభాష్ వెళ్లిపోతాడు. కావ్య అపర్ణ గదిలోకి వెళ్తుంది. ఏంటీ అని అపర్ణ అడుగుతుంది.
పెత్తనం చేయమని కాదు
మీరెందుకు మధ్యలో వచ్చారు అని కావ్య అంటుంది. అది నా వ్యక్తిగత విషయం. నేను ఇంటి కోడలిగా ఒప్పుకున్నాను. వ్యక్తిగత విషయాల్లో తల దూర్చమని కాదు అని అపర్ణ అంటుంది. మావయ్య కొనిచ్చిన చీరను పనిమనిషికి ఇవ్వడం కూడా వ్యక్తిగత విషయమేనా అని కావ్య అడుగుతుంది. నిన్ను రాయబారిగా పంపించారా అని అపర్ణ అంటుంది. నేనేం చిన్నపిల్లను కాదు. నాకు అర్థం అవుతుంది. ఈ నిశబ్ధ యుద్ధం ఆపేయలాని వచ్చాను అని కావ్య అంటుంది.
అసలు ఏమనుకుంటున్నావ్ నీ గురించి నువ్వు అని అపర్ణ అంటే.. మీరిలా దబాయిస్తే నాకు భయమేస్తుంది. భయంలో అంతా మర్చిపోతాను అని కావ్య భయంగా అంటుంది. అంత భయం, భక్తి ఉంటే అత్త గారిని ఇలా నిలదీయడానికి రావు. పోనిలే అని ఇంటి కోడలిగా ఒప్పుకుంటే అత్తపై పెత్తనం చేయమని కాదని అపర్ణ అంటుంది. పెత్తనం చేసే మొహమేనా నాది. పెత్తనం లేదు విత్తనం లేదు. మీరు ఇలా చేస్తే నాకు మీ కొడుకుకి కష్టంగా ఉందని కావ్య అంటుంది.
అప్పు అరెస్ట్
అయితే.. అయితే ఏం చేయమంటావ్. మీ మావయ్య గారు ఏ తప్పు చేయలేదని అంటున్నావా అని అపర్ణ అంటుంది. తప్పే. ఆయన తప్పు చేయలేదని నేనేం సపోర్ట్ చేయట్లేదని కావ్య అంటుంది. మరి.. అయిపోయింది కదా. తప్పు చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. నువ్ ఒప్పుకున్నావ్. ఇంకేముంది అని అపర్ణ అంటుంది. ఇక అంతేనా.. ఎప్పటికీ అంతేనా అని కావ్య అంటుంది. అంతే అని అపర్ణ చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో పోలీసులు అప్పును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచుతారు. అక్కడికి కల్యాణ్ వెళ్తాడు.