Best Web Hosting Provider In India 2024
ఆంద్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)గా వివేక్ యాదవ్‌ను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆమోదించింది. ఈ మేరకు సీఎస్ కు లేఖ అందింది. దీంతో ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
మొన్నటి వరకు వివేక్ యాదవ్ CRDA కమిషనర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా కూడా పని చేశారు. కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను సీఆర్డీఏ కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ చేసింది. ఇటీవలే కొత్త సీఈవో నియామకానికి ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పేర్లు పంపించింది. ఇందులో వివేక్ యాదవ్ పేరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేక్ కుమార్ మీనా….
ప్రస్తుతం సీఈవోగా ఉన్న ముకేశ్ కుమార్ మీనాకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన్ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రమే ఏపీ సీఈవో బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ మీనా రిలీవ్ అయ్యారు. తాజా నియామకానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు.
టాపిక్