Ekam Web Series: ప్ర‌కాష్ రాజ్ ఏక‌మ్ వెబ్‌సిరీస్ రిలీజ్‌…ఓటీటీలో కాదు…స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Best Web Hosting Provider In India 2024

Ekam Web Series: ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ వెబ్‌సిరీస్ ఏక‌మ్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. అయితే ఈ సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసే అవ‌కాశం లేదు. ఈ సిరీస్‌ను ఓ వెబ్‌సైట్ ద్వారా రిలీజ్ చేశారు. డ‌బ్ల్యూడ‌బ్బ్యూడ‌బ్బ్యూ ఏకమ్ దిసిరీస్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌లో మాత్ర‌మే ఈ సిరీస్ చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఈ వెబ్ సైట్‌లోనూ ఏక‌మ్ సిరీస్‌ను ఉచితంగా కాకుండా 149 రూపాయ‌లు చెల్లించి చూడాల్సిఉంటుంది. ట్రాన్సాక్ష‌న‌ల్ వీడియో ఆన్ డిమాండ్ ప‌ద్ద‌తిలో మేక‌ర్స్ ఏక‌మ్ సిరీస్‌ను విడుద‌ల‌చేశారు.

ఆంథాల‌జీ సిరీస్‌….

అంథాల‌జీ సిరీస్‌గా ఏక‌మ్ తెర‌కెక్కింది. స‌మాజంలో పేరుకు పోయిన అస‌మాన‌త‌లు, కుల‌వివ‌క్ష‌, మాన‌వీయ విలువ‌ల నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ప‌లువురు క‌న్న‌డ అగ్ర న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌కాష్ రాజ్‌తో పాటు రాజ్ బీ శెట్టి, కాంతార కిషోర్‌, ప్ర‌కాస్ తుమ్మినాడ్‌, షానిల్ గురు, రేవ‌తి ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.

ఏడు ఎపిసోడ్స్‌…

మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో ఏక‌మ్ సిరీస్‌ను రిలీజ్ చేశారు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పేరు పెట్టారు. భిన్న క‌థ‌ల‌తో తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు సుమంత్ భ‌ట్‌, సందీప్ పీఎస్ క్రియేట‌ర్స్ గా వ్య‌వ‌హ‌రించారు.

2020లోనే ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్త‌యింది. ఈ వెబ్‌సిరీస్‌ను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొన‌డానికి ముందుకు రాలేదు. క‌న్న‌డ వెబ్‌సిరీస్‌ల‌కు డిమాండ్ ఉండ‌ద‌ని, ఎవ‌రూ కొన‌ర‌ని చాలా మందిలో అపోహ ఉంద‌ని, అందుకే త‌మ సిరీస్‌ను ఏ ఓటీటీ సంస్థ‌లు తీసుకోలేద‌ని క్రియేట‌ర్స్ అన్నారు. అందుకే తామే సొంతంగా ఓ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకొని ఈ సిరీస్‌ను రిలీజ్ చేసిన‌ట్లు తెలిపారు.

క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టి…

క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టి ఏక‌మ్ వెబ్‌సిరీస్‌కు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ వెబ్ సిరీస్ నిర్మాణంలో ర‌క్షిత్ శెట్టి ఓ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించాడు. . డ‌బ్ల్యూడ‌బ్బ్యూడ‌బ్బ్యూ ఏకమ్ దిసిరీస్ డాట్ కామ్ అనే ప్లాట్‌ఫామ్ కూడా ర‌క్షిత్ శెట్టిదేన‌ని క్రియేట‌ర్స్ సుమంత్‌, సందీప్ తెలిపారు.

ద‌క్షిణాది భాష‌ల్లో…

ఏక‌మ్ వెబ్‌సిరీస్ కు ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు, న‌లుగురు సినిమాటోగ్రాఫ‌ర్లు ప‌నిచేశారు. క‌న్న‌డంలో వ‌చ్చిన రెస్పాన్స్‌ను బ‌ట్టి మిలిగిన ద‌క్షిణాది భాష‌ల్లోఈ సిరీస్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తోన్నారు.

తెలుగులో చిరంజీవి కూతురు వెబ్ సిరీస్ లో…

ప్ర‌కాష్ రాజ్ వెబ్‌సిరీస్ ల‌లో న‌టించ‌డం ఇది కొత్తేమీ కాదు. గ‌తంలో త‌మిళంలో పావ క‌దైగ‌ల్‌, న‌వ‌ర‌స, అనంతం అనే వెబ్‌సిరీస్‌లు చేశాడు. తెలుగులో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేసిన షూట్అవుట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్ లో ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ప్ర‌స్తుతం తెలుగులో ఎన్టీఆర్ దేవ‌ర‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీలో ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తోన్నాడు. ఈ ఏడాది మ‌హేష్ బాబు గుంటూరుకారంతో పాటు కాజ‌ల్ స‌త్య‌భామ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు ప్ర‌కాష్ రాజ్‌.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024