Best Web Hosting Provider In India 2024
Kothur Accident Video : హైదరాబాద్‌లోని కొత్తూరు వై జంక్షన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సీసీటీవీలో రికార్డైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు వై జంక్షన్ వద్ద మూడు లారీలు ఢీకొన్న ఘోర ప్రమాదం సీసీటీవీలో రికార్డైంది. ఓ లారీ రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదానికి కారణమైంది. ఓ లారీ రోడ్డు దాటుతుండగా.. వేగంగా వస్తున్న మరో లారీ…దానిని ఢీకొట్టి రోడ్డు అవతలి వైపునకు వెళ్లి మరో లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో మూడో లారీ పక్కకు బోల్తా పడింది. లారీ పక్కన వెళ్తున్న బైక్ పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న అంజయ్యపై మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అసలేం జరిగింది?
ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి బైకర్ ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద డీసీఎం వాహనం రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. అదే మార్గంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ రోడ్డు దాటుతున్న డీసీఎంను గమనించకపోవడంతో…దగ్గరగా వచ్చాక డీసీఎంను ను ఢీకొట్టి వెంటనే కుడివైపునకు లారీని తిప్పాడు. దీంతో డీసీఎంను ఢీకొట్టుకుంటూ రోడ్డుకు అవతలివైపు వెళ్లిన మరో లారీ అటుగా కాటన్ లోడుతో వెళ్తోన్న మరో లారీని ఢీకొట్టింది. ఆ లారీ పక్క వెళ్తున్న స్కూటీపై పడింది. స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటీ వెనక సీట్‌లో కూర్చోన్న మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘోర ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం 2.14 గంటలకు చోటుచేసుకుంది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తూరు సీఐ తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్