Best Web Hosting Provider In India 2024
Kalki 2898 AD Box Office Collection: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదలైన 17 రోజులు పూర్తి చేసుకుంది. కల్కి 2898 ఏడీ సినిమా 17వ రోజున ఇండియాలో రూ. 14.35 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్లను సాధించినట్లు సమాచారం.
అయితే, గత వారంతో పోలిస్తే జూలై 13న (శనివారం) బాక్సాఫీస్ వద్ద కల్కి కలెక్షన్స్ 139 శాతం పెరిగాయి. దీంతో కల్కి 2898 ఏడీ విడుదలైనప్పటి నుంచి అంటే 17 రోజుల్లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషల్లో కలిపి ఇండియాలో కల్కి వసూళ్లు రూ. 567.7 కోట్ల మార్కును దాటాయి.
ఈ 567.7 కోట్లల్లో తెలుగు నుంచి రూ. 260.35 కోట్లు, తమిళం నుంచి 32.7 కోట్లు, హిందీ నుంచి రూ. 245 కోట్లు, కర్ణాటక నుంచి 4.75 కోట్లు, మలయాళం నుంచి రూ. 20.9 కోట్లు వచ్చాయి. అలాగే 17వ రోజున వచ్చిన రూ. 14. 35 కోట్లల్లో తెలుగు నుంచి 4.85 కోట్లు, తమిళనాడు నుంచి 35 లక్షలు, హిందీ నుంచి రూ. 8.3 కోట్లు, కన్నడ నుంచి 2 లక్షలు, మలయాళం నుంచి 65 లక్షలుగా ఉన్నాయి.
అలాగే ఇప్పటివరకు కల్కి సినిమాకు ఓవర్సీస్‌లో రూ. 117.05 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ సినిమాకు 16 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా వెయ్యి కోట్లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కల్కి నిర్మాతలకు ఇప్పటి వరకు రూ. 106.3 కోట్ల లాభాలు వచ్చినట్లు సమాచారం.
దాంతో కల్కి 2898 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. పోస్ట్ అపోకలిప్టిక్ తర్వాత మానవ మనుగడ ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇటీవల విడుదలైన ఇండియన్ 2, సర్ఫిరా కంటే మెరుగ్గా ఉంది.
ఇక కల్కి 2898 ఏడీ సినిమాకు 18వ రోజున అంటే ఇవాళ ఇండియాలో రూ. 3.83 కోట్లకైపైగా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేశారు.
కాగా, రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు “ప్రాజెక్ట్ కె” గా పిలువబడిన ఈ చిత్రం హిందూ ఇతిహాసం మహాభారతంలోని అంశాలను సైన్స్ ఫిక్షన్‌తో మిళితం చేసి తెరకెక్కించారు.