Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో రంగా గాడిని రిషిలా మారిస్తే మనకు ఎండీ పదవి దక్కుతుందని శైలేంద్ర అంటాడు. అవును, అదేరా ప్లాన్. కానీ, వాడు ఇక్కడికి ఎలా వస్తాడు. వాడు వస్తే ఇన్నాళ్లు మనం చేసిన అరాచకాలకు, ప్లాన్స్‌కు ఫలితం దక్కినట్లు అవుతుందని దేవయాని అంటుంది. అయితే నేను వాడిని ఒప్పించి తీసుకొస్తాను అని శైలేంద్ర అంటాడు.
కచ్చితంగా వర్కౌట్ అవుతుంది
ఎలా తీసుకొస్తావ్ అని దేవయాని అంటుంది. నేను వాడి గురించి, వాడి సమస్యల గురించి ఆరా తీశాను. వాడు వాళ్ల మావయ్య దగ్గర అప్పు చేశాడు. అందుకోసం ఆటో నడుపుతున్నాడు అని శైలేంద్ర అంటాడు. అయితే నువ్వెళ్లి డైరెక్ట్‌గా మాట్లాడకు. వాళ్ల మామ నుంచి నరుక్కురా అని దేవయాని ఓ ప్లాన్ చెబుతుంది. నువ్ నేను చెప్పినట్లు చేస్తే ప్లాన్ కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాళ్ల మావయ్యే రంగాను మనకు అప్పజెపుతాడు. నువ్ కొంచెం కూడా మాట జారకు. ఇక ఎండీవీ నువ్వే అని దేవయాని అంటుంది.
సరే నేను వాడి ముందు మంచివాళ్లలా నటిస్తాను. మనకు పదవులపై ఆశలేదన్నట్లుగా ఉంటాను. వాడు ఏం చేసిన నేను అనను. ఫ్రస్టేట్ అవ్వను అని శైలేంద్ర కాల్ కట్ చేస్తాడు. ఇక ఎండీని నేనే. మ్యానేంజిగ్ డైరెక్టర్ శైలేంద్ర భూషణ్. అబ్పా ఇలా అంటుంటే ఎంత వినసొంపుగా ఉందో అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు మీరు కాలేజీ ఎండీ కదా. ఉన్నపలంగా ఎందుకు వదిలి వచ్చారు అని రంగా అంటాడు. అక్కడ నన్ను ముంచేవాళ్లే ఉన్నారు అని వసుధార అంటుంది.
కచ్చితంగా ఆన్సర్ ఇస్తాను
మరి కాలేజీపై ఎందుకు కోపం. అది మీ రిషి సార్ కలల సౌధం అన్నారు. దాన్ని రిషి సార్ మీకు అప్పగించారు కదా. అలాంటప్పుడు మీ రిషి సార్ నమ్మకాన్ని ఎందుకు వొమ్ము చేశారు అని రంగా అడుగుతాడు. దాంతో వసుధార షాక్ అవుతుంది. ఇదే ప్రశ్న రేపు మీ రిషి సార్ వచ్చి అడిగితే ఏం సమాధానం చెబుతారు అని రంగా అంటాడు. చెబుతాను. అదే రిషి సార్ అడిగితే కచ్చితంగా సమాధానం చెబుతాను. మీరే రిషి సార్ అని ఒప్పుకోండి ఇప్పుడే చెబుతాను అని వసుధార అంటుంది.
నేను చాలా సార్లు చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. నేను రిషి సార్ కాదు. రంగాను. ఆటో డ్రైవర్‌ను. మీరు నేనే రిషి సార్ అనుకుని భ్రమలో ఉండి రిషి సార్ మీకు అప్పజెప్పిన కాలేజీకి ద్రోహం చేస్తున్నారు. కాలేజీ నుంచి తప్పుకుని కాలేజీకి, రిషికి ద్రోహం చేస్తున్నారు. మీరు నన్ను రిషి సార్లా మారాలని చూస్తున్నారు. కానీ, కాలేజ్ గురించి ఆలోచించారా. కాలేజీ స్టూడెంట్స్ భవిష్యత్ గురించి ఆలోచించారా. వాళ్ల బాధ్యత ఎవరు తీసుకున్నారో ఆలోచించారా అని రంగా నిలదీస్తాడు.
ఎండీ అంటూ ఎవరు లేరు
మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెడితే.. మీకు ఏం అవుతోంది అని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ కాలేజీ గురించి, మా మావయ్య గురించి ఆలోచించారా. ఏ సంబంధం లేని నాకే జాలిగా ఉంది. పాపం ఆ కాలేజీ స్టూడెంట్స్ భవిష్యత్ గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందని రంగా అంటాడు. దాంతో బుజ్జి దగ్గర ఫోన్ తీసుకుని కాలేజీకి ఫోన్ చేస్తుంది. ఎండీతో మాట్లాడాలని వసుధార అంటే.. ఎండీ అంటూ ఎవరు లేరని కాలేజీ నుంచి చెబుతారు. దాంతో వసుధార షాక్ అవుతుంది.
వసుధార మేడమ్ వెళ్లిపోయాక ఎండీ పదవిని ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోయారు. దాంతో ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకోవాలనుకుంటుంది. రేపు గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకున్నాకా ఎండీ ఎవరో తెలుస్తుంది అని కాలేజీ వాళ్లు చెబుతారు. దాంతో షాక్ అయిన వసుధార కాల్ కట్ చేస్తుంది. అదే విషయం రంగాకు చెబుతుంది. చూశారా. కేవలం మీరు చేసిన తప్పు వల్ల కాలేజీ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది. కష్టాలకు ఎదురొడ్డాలి. పారిపోయి రాకూడదు అని రంగా అంటాడు.
3 నెలల శపథం
పారిపోయి రాలేదు. ఓడిపోయి వచ్చాను. బయటకు వచ్చేటప్పుడు నా ప్రాణం విలవిల్లాడింది. కానీ, రాకుండా తప్పలేదని వసుధార అంటుంది. ఏమైనా కానీ మీరు చేసింది మాత్రం తప్పు అని రంగా అంటాడు. నన్ను ఏం చేయమంటారు. బతికి ఉన్న నా భర్తకు పిండం పెడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను అని మూడు నెలల శపథం గురించి జరిగింది చెబుతుంది వసుధార. తర్వాత నేను గెలుపుకు దగ్గరగా ఉన్నాను. మీరు నాతో వస్తే నేను గెలిచినట్లే అని వసుధార అంటుంది.
నేను రాను అని రంగా అంటాడు. ఎందుకు రారు. అక్కడ మీ వాళ్ల దగ్గర నటించలేనని రానని అంటున్నారా. పదండి సార్. మన కాలేజీ మనకోసం చూస్తోంది అని వసుధార అంటుంది. అక్కడ నా వాళ్లు ఎవరు లేరు. నేను రిషి అనుకుని మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు వెళ్తే మీ కాలేజీకి మంచి జరుగుతుంది అని రంగా అంటాడు. మీరు రాకుంటే నేను వెళ్లను అని వసుధార అంటుంది. మీరు వెళ్లడం వెళ్లకపోవడం మీ ఇష్టం. కానీ, నేను మాత్రం రాను అని రంగా వెళ్లిపోతాడు.
నువ్వేరా సమస్య
అనంతరం రంగా మావయ్య ఇంటికి వస్తాడు. వడ్డీ డబ్బుల కోసం వచ్చారా అని రంగా అంటే.. కాదురా. ఇంకా టైముందిలేరా అని సంజీవ అంటాడు. అసలు ఏం జరుగుతుంది. నా కూతురు జీవితం గురించి ఆలోచిస్తుంటే ఆందోళనగా ఉంది. తనను ఎలాగైనా పెళ్లికి ఒప్పించుకుంటాను అని సంజీవ అంటాడు. మరి ఇంకేంటీ సమస్య అని రంగా అడిగితే.. నువ్వేరా సమస్య. నీ తప్పుంది లేనిది పక్కన పెడితే పెళ్లి వాళ్లకు ఇంకా అనుమానం తీరేలా లేదు. వాళ్లు నీతో మళ్లీ మాట్లాడాలని అంటున్నారు అని సంజీవ అంటాడు.
నేను వాళ్లకు అప్పుడే క్లియర్‌గా చెప్పాను కదా. వాళ్లు కూడా క్లియర్‌గా అర్థం చేసుకున్నామని చెప్పారు. మళ్లీ నేనొచ్చి మాట్లాడటం ఏంటని రంగా అంటాడు. ఏమోరా.. ఆ అబ్బాయికి ఏవో డౌట్స్ ఉన్నాయట. అవి తీరుతేనే పెళ్లి జరుగుద్దట. వాళ్ల అన్నయ్యను ఆ అబ్బాయి పంపించాడు. నీకోసం వెయిట్ చేస్తున్నారు అని సంజీవ అంటాడు. ఇంతలో వచ్చిన వసుధార ఎవరు వచ్చారని అంటుంది. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మీరు జోక్యం చేసుకోకండి అని రంగా అంటాడు.
రంగాతో మాట్లాడితే
నువ్ ఏం చేస్తావో గానీ వాళ్లతో ఏం మాట్లాడతావో గానీ నా కూతురు పెళ్లి జరగాలి. దాని జీవితం నీ చేతుల్లో ఉంది అని సంజీవ అంటాడు. నేను చూసుకుంటాను. తను ఎక్కడ ఉన్నాడు అని రంగా అంటాడు. డౌట్స్ ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా. ఎందుకు తను రాలేదు అని వసుధార అడుగుతుంది. ఏమో నేను ఇంటికే రమ్మన్నాను. కానీ తను రానని అన్నాడు. మా ఇంటికి రమ్మన్నాను అయిన రానని చెప్పాడు. అదే నాకు అర్థం కాలేదు. రంగాతో మాట్లాడితే సరిపోతుంది అన్నాడు అని సంజీవ అంటాడు.
సరే మావయ్య వెళ్దాం. మేడమ్ గారు మీరు రాకండి. ఇంట్లోనే ఉండండి అని వెళ్లిపోతారు రంగా, సంజీవ. కట్ చేస్తే మేడపై కూర్చుని జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటుంది వసుధార. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు. శైలేంద్రేనా. ఇంటికి రాకుండా బయట ఎక్కడో కలవడం ఏంటని వసుధార అనుకుంటుంది. తర్వాత రంగా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది వసుధార. సర్ ప్రవర్తన చాలా వింతగా ఉంది. నాకు ఏదో చెప్పాలని చూస్తున్నారు. గవర్న్మెంట్ కాలేజీని తీసుకుంటుందని తెలిసి కూడా మౌనంగా ఉండిపోతున్నారు అని వసుధార అనుకుంటుంది.
రిషిని చూసిన రంగా
అయినా పెళ్లి చూపులకు దేవయాని శైలేంద్ర ఎందుకు వస్తారు. కానీ, వాళ్ల వాయిస్‌లా ఎందుకు అనిపించింది. అసలు ఏదో జరుగుతుంది. ఫాలో అవుదామంటే ఇంట్లోనే ఉండమని రిషి సార్ చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి అని వసుధార అనుకుంటుంది. మరోవైపు రంగాతో పర్సనల్‌గా మాట్లాడాలని శైలేంద్ర చెబితే సంజీవ వెళ్లిపోతాడు. పెళ్లి చూపులప్పుడే మొత్తం చెప్పాను కదా. ఎన్నిసార్లు చెప్పాలి. సరోజకు నాకు ఏం లేదని. మేమిద్దరం బావ మరదళ్లమే అని రంగా అంటాడు.
నాకు తెలుసు. నాకు అప్పుడే క్లియర్ అయింది. కానీ నీతో మాట్లాడాలనే ఇలా పిలిపించాం. ఒక్కసారి ఈ ఫొటో చూడు అని రిషి ఫొటో చూపిస్తాడు శైలేంద్ర. దాంతో రంగా షాక్ అయిపోతాడు. ఏంటీ షాక్ అయ్యావా. నీ ఫొటోకి సూట్ బూటు వేశానని అనుకుంటున్నావా. కానీ, నువ్ వేరు ఈ ఫొటోలో ఉన్నది వేరు. నేను కూడా మొదట్లో నమ్మలేదు. కానీ, తర్వాత నమ్మకం కుదిరింది అని శైలేంద్ర అంటాడు. ఎవరు సార్ అతను అని రంగా అడుగుతాడు.
ఒక రోజు కూడా సరిపోదు
నా తమ్ముడు రిషీంద్ర భూషణ్. ఒక కాలేజీకి వారసుడు. ఎంతో పేదమంది విద్యార్థులకు దేవుడు. తను మంచి గురించి చెప్పడానికి ఒక రోజు కూడా సరిపోదు అని శైలేంద్ర అంటాడు. అదంతా వింటాడు రంగా. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్