Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ జెండా ఐదున్నర కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజలకు కొండంత అండ.. 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకే ముచ్చెమటలు పట్టించిందీ జెండా.. అధికారమనే ఆయుధంతో అరాచకాలు సాగిస్తున్నవారికి ఎదురొడ్డి పోరాడిందీ జెండా.. దోపిడీదారుల చెర నుంచి ఆంధ్రరాష్ట్రాన్ని విముక్తి చేసిందీ జెండా.. దశాబ్దాల అణచివేతతో చీకట్లో మగ్గుతున్న వర్గాలను చెయ్యి పట్టుకొని వెలుగువైపు నడిపిస్తోందీ.. నిశబ్ద నిశీధి నుంచి ఉషోదయంలా వెలుగులు చిమ్ముతోందీ జెండా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సువర్ణపాలనను అందించిన మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం, ప్రజల కోసం పురుడోసుకున్న ఈ జెండా.. 12 వసంతాలను పూర్తి చేసుకొని 13వ వసంతంలోకి అడుగుపెడుతోంది.. నమ్మకానికి నిదర్శనంగా నిలిచి.. నేడు ప్రతి ఇంట్లో చిరునవ్వుల వెలుగులు పూయిస్తోంది..