Best Web Hosting Provider In India 2024
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువతిపై చిన్ననాటి స్నేహితులు అత్యాచారం చేశాడు. ఉద్యోగం వచ్చిందని ఓ యువతి తన స్నేహితుడికి పార్టీ ఇవ్వగా, అదే అదునుగా భావించి మరో వ్యక్తితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్ లో యువతిపై ఇద్దరు యుకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తు్న్న ఓ యువతి.. తనకు ఇటీవల ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో తెలిపింది. అతడు పార్టీ ఇవ్వాలని కోరడంతో సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి వనస్థలిపురం పరిధిలోని ఓ హోటల్‌కు వెళ్లారు. రెస్టారెంట్ లో ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీలో ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం ఆ హోటల్ కింద అంతస్తులోని రూములో వెళ్లారు. కాసేపటి తర్వాత యువతి మత్తు నుంచి తేరుకోగా, తన గదిలో గౌతమ్ రెడ్డితో పాటు, మరో యువకుడు ఉండడాన్ని గమనించింది.
స్నేహితురాలిపై దారుణం
స్నేహితుడు, మరో వ్యక్తి తనపై అత్యాచారం చేశారని తెలుసుకున్న యవతి పెద్ద కేకలు వేసింది. దీంతో వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత యువతి తన స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత స్నేహితురాలి సాయంతో వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు… హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డితో పాటు మరో యువకుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్