Telugu Tv Shows: టీఆర్‌పీలో స్టార్ మా షోస్ నంబ‌ర్ వ‌న్ – శ్రీముఖి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ టాప్‌!

Best Web Hosting Provider In India 2024

Telugu Tv Shows: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ షో నెల రోజుల క్రితం స్టార్‌మాలో ప్రారంభ‌మైంది.ఈ కామెడీ గేమ్ షోకు అన‌సూయ‌,తో పాటు శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. బిగ్‌బాస్ మేల్‌, ఫిమేల్ కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఈ గేమ్‌షోలో పార్టిసిపేట్ చేస్తోన్నారు.

బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్‌…

ఇందులో బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్‌దీప్ చౌద‌రితో పాటు అర్జున్ అంబాటి, శ్రీక‌ర్‌, టేస్టీ తేజ‌, యాద‌మ‌రాజు, చైతూతో పాటు మ‌రికొంద‌రు కిరాక్ బాయ్స్ టీమ్ నుంచి పోటీప‌డుతోండ‌గా ఖిలాడీ గ‌ర్ల్స్ టీమ్ నుంచి ప్రియాంక జైన్‌, దీపికా, శోభాశెట్టి, ఆయేషా ఖాన్‌, ప‌ల్ల‌వి గౌడ‌, విష్ణుప్రియ‌తో పాటు మ‌రికొంద‌రు కంటెస్టెంట్స్‌గా బ‌రిలో దిగారు.

హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌…

జూన్ 29న ప్రారంభ‌మైన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్‌ షో నెల రోజుల్లోనే బుల్లితెర‌పై పాపుల‌ర్ అయ్యింది. తాజా టీఆర్‌పీ రేటింగ్‌లో తెలుగులో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకుంది. లేటెస్ట్ టీఆర్‌పీలో కిరాక్ బాయ్స్ షో 4.93 టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది. అర్బ‌న్ ఏరియాలో ఈ షోకు 5.38 టీఆర్‌పీ వ‌చ్చింది.

ఆదివారం స్టార్ మా ప‌రివారం…

కిరాక్ బాయ్స్ త‌ర్వాత ప్లేస్‌లో శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం నిలిచింది. శ్రీముఖి షోకు 4.80 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది.

గ‌త కొన్ని వారాలుగా ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం టాప్‌గా నిలుస్తూ వ‌చ్చింది. తాజాగా ఈ షోను అన‌సూయ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ దాటేసింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయ‌డం, అన‌సూయ జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఫ‌న్నీ గేమ్స్ తో కిరాక్ బాయ్స్ షో బుల్లితెర ఫ్యాన్స్‌ను మెప్పిస్తోంది.

సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ స్టార్‌…

తెలుగు టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో మూడో స్థానంలో శ్రీదేవి డ్రామా కంపెనీ నిలిచింది. ఈ కామెడీ షోకు 3.94 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. నాలుగు, ఐదో స్థానాల్లో కూడా ఈటీవీ షోలే ఉన్నాయి. సుధీర్ రీఎంట్రీ షో ఫ్యామిలీ స్టార్ టీఆర్‌పీలో వెనుక‌బ‌డిపోయింది.3.57 టీఆర్‌పీతో ఈ గేమ్ షో టాప్ ఫోర్‌లో నిలిచింది. ఢీ ప్రీమియ‌ర్ లీగ్ 3.38, జ‌బ‌ర్ధ‌స్థ్ 3 టీఆర్‌పీని సొంతం చేసుకున్నాయి. అలాగే సుమా అడ్డా 2.27, పాడుతా తీయ‌గా కు 2 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు 0.76, డ్రామా జూనియ‌ర్స్ 0.63తో డిస‌పాయింట్ చేశాయి. శుభ‌మ‌స్తు 0.45తో అతి త‌క్కువ టీఆర్‌పీని ద‌క్కించుకున్న టీవీ షోగా నిలిచింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024