Best Web Hosting Provider In India 2024
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 1 August Episode) ఈరోజుతో తనకి, ఈ ఇంటికి ఉన్న రుణం తీరిపోతుందని, పిల్లలకి దూరమైనా పక్కనే ఉన్నానే ధైర్యం ఉండేదని మనోహరి వల్ల ఇక నుంచి అది కూడా ఉండదని బాధపడుతుంది అరుంధతి.
ముగ్గు వేయలేదేంటీ
అప్పుడే హాల్లోకి వచ్చిన మిస్సమ్మ అరుంధతిని చూసి ఏంటక్కా.. నిన్నంతా కనిపించలేదు. మీరు కనిపించకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఏం బాధ ఉన్నా మీతో పంచుకోవాలని అనిపిస్తుంది అంటుంది. నాక్కూడా నువ్వున్నావనే ధైర్యం మిస్సమ్మ అంటుంది అరుంధతి. వాకిట్లో ఇంకా ముగ్గు వేయలేదని, వెంటనే వేయమంటుంది అరుంధతి. దానికి సరేనంటుంది మిస్సమ్మ.
దగ్గరుండి మిస్సమ్మతో అమర్‌కి ఇష్టమైన లోటస్ ముగ్గు వేయిస్తుంది అరుంధతి. అమర్ కిందకి రావడం చూసి అరుంధతి కంగారు పడుతుంది. ముగ్గు తొక్కబోతున్నారని అంటుంది. మిస్సమ్మ కంగారుగా లేచి అమర్‌ని అడ్డుకుంటుంది. దాంతో అమర్ బ్యాలెన్స్ తప్పి పడబోతాడు. అప్పుడే పట్టుకుంటుంది మిస్సమ్మ. వాళ్లిద్దరినీ అలా చూడలేక అక్కడ నుంచి వెళ్లిపోతుంది అరుంధతి.
భాగీని చూడాలని ఉంది
ముగ్గు వేస్తే ముగ్గులో దించొచ్చనుకున్నాగానీ ఇలా మీరే పడిపోతారనుకోలేదు అంటుంది మిస్సమ్మ. తనకి ఎంతో ఇష్టమైన లోటస్ ముగ్గు చూసి అరుంధతిని గుర్తు చేసుకుంటాడు అమర్. ఇద్దరూ కాసేపు కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటారు. ఈ సీన్ కాస్తా రొమాంటిక్‌గా సాగుతుంది. మరోవైపు రామ్మూర్తి ఒకసారి భాగీకి ఫోన్ చేసి రమ్మని చెప్పమని, చూడాలని ఉందని మంగళతో అంటాడు.
సరేనంటూ చిరాగ్గా బయటకు వెళ్లి మనోహరికి ఫోన్ చేసి విషయం చెబుతుంది మంగళ. తొందరగా ఫోన్ చేసి అమర్‌ని అందర్నీ తీసుకుని హాస్పిటల్‌కి రమ్మని చెప్పమంటుంది మనోహరి. అదేంటి అని ఆశ్చర్యపోతుంది మంగళ. అమర్ అరుంధతి తల్లిదండ్రులు ఎవరో కనుక్కుంటా అంటున్నాడు. ఈ ఒక్కరోజైనా అమర్‌ని ఆపగలిగితే చాలు రేపటి నుంచి నాకు మంచి టైమ్ స్టార్ట్ అవుతుంది అంటుంది మనోహరి.
పక్కింటి అక్క చెప్పింది
ఒక్కరోజులో ఎలా వదిలేస్తాడు, మా ముసలోడైతే పాతికేళ్ల నుంచి తన కూతురు కోసం వెతుకుతూనే ఉన్నాడు అంటుంది మంగళ. అదంతా నేను చూసుకుంటాలే అని ఫోన్ కట్ చేస్తుంది మనోహరి.
అమర్, భాగీని ముగ్గు గురించి అడుగుతాడు. మీకు ఇష్టమని వేశాను అంటుంది భాగీ. ఈ ముగ్గు నాకు ఇష్టం అని ఎవరు చెప్పారు అంటాడు అమర్. పక్కింటి అక్క చెప్పింది. అక్క వేస్తుంటే తను చూసిందంట అని చెబుతుంది భాగీ.
సరేనంటూ జాగింగ్‌కి వెళ్లిపోతాడు అమర్. పక్కనే దాక్కున్న అరుంధతిని పిలిచి ఆయనంటే మీకు భయం కదా? అంటుంది భాగీ. ఏం చెప్పాలో అర్థంకాక అవును అంటుంది అరుంధతి. పెళ్లి చేసుకున్న నాకే ఆయనంటే భయం, మీరు భయపడటంలో తప్పులేదులెండి అంటుంది భాగీ. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు గమనించి ఘోరా తనను బంధించడానికి పూజ మొదలు పెట్టాడేమో అని భయపడుతుంది అరుంధతి.
జాగ్రత్తగా చూసుకోమ్మని
పిల్లల్ని అమర్‌ని జాగ్రత్తగా చూసుకోమని భాగీకి చెబుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మనోహరిని వదిలేయద్దని తను చేసిన తప్పులకు తప్పకుండా శిక్షపడేలా చూడమని అంటుంది. అదేంటక్కా.. అలా అంటున్నారు ఇప్పుడు ఎక్కడకు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది భాగీ. నేను వెళ్లాలి. ఎక్కడికో తెలియదు, మళ్లీ వస్తానో, లేదో తెలియదు మిస్సమ్మ.. కుటుంబానికి నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే వెళ్తున్నా అని బాధపడుతూ వెళ్లిపోతుంది అరుంధతి.
ఘోరా అరుంధతి అస్థికలతో పూజ చేసేందుకు సిద్ధమవుతాడు. కానీ, అతని గురువు ఆపి ఇది సరైన సమయం కాదని మూడు రోజులు ఆగమని చెబుతాడు. ఘోరా అరుంధతి ఆత్మను బంధిస్తాడా? రామ్మూర్తిని కలిసిన అమర్ నిజం తెలుసుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 02న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!