Potato Snacks: వేడివేడి పొటాటో బాల్స్ తిన్నారంటే… క్రంచీగా, టేస్టీగా ఉంటాయి, రెసిపీ ఇదిగో

Best Web Hosting Provider In India 2024

వానాకాలంలో సాయంత్రం పూట వేడివేడిగా స్నాక్స్ తినాలనిపిస్తుంది. పకోడీలు, బజ్జీలు వంటి వాటిని అధికంగా తింటారు. ఎక్కువగా బయట కొని తినేవాళ్లే ఎక్కువ. ఇక్కడ మేము క్రంచీ బంగాళాదుంప స్నాక్స్ రెసీపి ఇచ్చాము. ఇవి పొటాటో బాల్స్. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వానాకాలంలో స్పెషల్ బంగాళాదుంప క్రిస్ప్ రెసిపీని ప్రయత్నించండి. ఈ రెసిపీ తినడానికి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా తయారు చేయడం చాలా సులభం. అంతేకాదు ఈ రెసిపీ రుచి పిల్లల నుంచి పెద్దల వరకు బాగా నచ్చుతుంది. మీరు ఇంట్లో పార్టీ నిర్వహించినప్పుడు కూడా ఈ రెసిపీని తయారు చేసి వడ్డించవచ్చు.

పొటాటో బాల్స్ రెసిపీకి

బంగాళాదుంపలు – 4

మైదా – అర కప్పు

పోహా – ముప్పావు కప్పు

ఉప్పు – రుచికి సరిపడా

నూనె-తగినంత

నీరు – సరిపడినన్నీ

పచ్చిమిర్చి – ఒకటి

జీలకర్ర పొడి- ఒక స్పూను

పుదీనా తరుగు – రెండు స్పూన్లు

నిమ్మరసం – ఒక స్పూను

పొటాటో బాల్స్ రెసిపీ

  1. పిల్లలకు బంగాళాదుంపతో చేసిన రెసిపీలు ఎంతో నచ్చుతాయి. పొటాటో బాల్స్ క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు నచ్చుతాయి.
  2. ముందుగా బంగాళాదుంపలను ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేసి బాగా మెత్తగా చేత్తోనే మెదుపుకోవాలి.
  3. ఇప్పుడు ఈ బంగాళాదుంప పేస్ట్ లో తరిగిన పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి అన్నింటిని బాగా కలపాలి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ ను తయారు చేసుకోవాలి.
  5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. మరోవైపు ఒక గిన్నెలో మైదా పిండి, నీళ్లు వేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి.

7. అలాగే పోహాను మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. వాటిని ఒక ప్లేటులో వేసి ఉంచండి.

8. ఇప్పుడు ముందుగా చేసుకున్న బాల్స్ ను మైదా పిండి నీళ్లలొ వేసి ముంచాలి.

9. తరువాత తీసి పోహా పొడిలో వాటిని దొర్లించాలి.

10. ఈ బాల్స్ ను కాగిన నూనెలో వేసి వేయించాలి.

11. వాటిని తీసి టిష్యూ పేపర్లో వేస్తే అదనపు నూనెను పీల్చేస్తుంది. అంతే పొటాటో బాల్స్ రెడీ అయినట్టే. వీటిని సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.

బంగాళాదుంపలను ఉడికించి ఈ రెసిపీ చేశాము కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదే. వాటిలోని పిండి పదార్థాలు చాలా వరకు తగ్గుతాయి. ఒకసారి పిల్లలకు వీటిని తినిపించి చూడండి, వారికి చాలా నచ్చడం ఖాయం.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024