TG Govt Job Calendar : అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల – పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఖరారు, ముఖ్య వివరాలివే

Best Web Hosting Provider In India 2024

TG Govt Job Calendar : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ వేదికగా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరాలను వెల్లడించారు. నోటిఫికేషన్‌ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలను పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం  గ్రూప్‌-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్‌-2ను డిసెంబరులో, గ్రూప్‌-3 నవంబరులో జరగనున్నాయి. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇస్తారు.  ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయి.

WhatsApp channel

టాపిక్

Telangana NewsTelangana AssemblyJobs
Source / Credits

Best Web Hosting Provider In India 2024