Best Web Hosting Provider In India 2024
Karthika deepam 2 serial today august 3rd epiosde: నరసింహ తాగి కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులు నా పెళ్ళాం జోలికి, నా కూతురు జోలికి వెళ్ళకుండా నాకు అడ్డుగా నిలబడ్డావ్ కదా. ఇప్పుడు కేసు కోర్టుకు వెళ్ళింది. నేను అన్నింటికీ బరితెగింఛానని అంటాడు. శ్రీధర్ వచ్చి వాడితో మాటలు ఏంటి బయటకు గెంటేయమని అంటాడు.
నరసింహ ఛాలెంజ్
నా కూతురిని తీసుకుని పోతే నువ్వు అడ్డుపడతావా?రేపు కోర్టులో ఎలా తీసుకుపోకుండా అడ్డుపడతావో చూద్దాం. శౌర్య నా కూతురు నేనే తండ్రిని అని చెప్పావ్ కదా. ధైర్యం ఉంటే ఇదే విషయం కోర్టులో చెప్పమని నరసింహ సవాల్ విసురుతాడు. శౌర్యను తీసుకెళ్లడం కాదు తన చేతిని కూడా పట్టుకొనివ్వనని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు.
ఆడదాని జీవితంతో ఆడుకున్న మగాడి జీవితం ముగింపు చాలా దారుణంగా ఉంటుందని కోర్టులోనే చూసుకుందామని అంటాడు. శ్రీధర్ కి కూడా ఆ మాట తలుగుతుంది. కార్తీక్ నరసింహను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు. శ్రీధర్ కార్తీక్ మీద కోప్పడతాడు. రేపు కోర్టుకు వీల్లేదు నీ మీద కోపంతో వాడు నిన్ను ఏమైనా చేస్తే ఏంటని శ్రీధర్ చెప్తాడు.
బాధపడిన అనసూయ
రేపు నేను కోర్టుకు వెళ్లకపోతే వాడికే ప్లస్ అందుకే కావాలని ఇక్కడకు వచ్చాడు. మీరు భయపడకండి నాకేం కాదు. నేను రేపు కోర్టుకు వెళ్లాలని కార్తీక్ తెగేసి చెప్తాడు. కూతురిని తీసుకుపోయే వరకు నరసింహ వదిలిపెట్టడు, అది జరిగే వరకు మనకు ఈ బాధలు తప్పవని శ్రీధర్ బాధపడతాడు.
నరసింహ తాగేసి ఇంటికి వస్తే శోభ తెగ తిడుతుంది. కార్తీక్ ఇంటికి వెళ్ళి వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చానని చెప్తాడు. అనసూయ మాత్రం భయపడుతుంది. వాళ్ళు ఇక మనల్ని ఏం చేయలేరు. మంచి లాయర్ ని పట్టానని చెప్తాడు. అనసూయ ఈ విషయం దీపకు తెలుసా అంటే తెలుసు నోటీసులు పంపించాం కదాని శోభ అంటుంది.
దీప ఎలాంటిదో రేపు కోర్టులో నిరూపిస్తానని నరసింహ అనేసరికి అనసూయ బాధపడుతుంది. దీప వ్యక్తిత్వం గురించి తలుచుకుంటుంది. నయానో భయానో బిడ్డను తెచ్చుకోమని గొడవలు వద్దని అంటాడు. శోభ మాత్రం వదిలిపెట్టకుండా తిడుతుంది. రేపు మనం కోర్టుకు వెళ్ళి మన కూతురిని తెచ్చుకుంటున్నాం. ఇక నుంచి మన ఇంట్లో పండగే అంటూ నరసింహ ధైర్యం చెప్తాడు.
జ్యోత్స్న అనుమానం
జ్యోత్స్న దీప గురించి ఆలోచిస్తుంటే పారిజాతం వచ్చి మాట్లాడుతుంది. ఇంత జరిగిన తర్వాత దీప ఇంటికి ఎలా వచ్చింది. తనకు కాస్త కూడా సిగ్గుగా అనిపించలేదా? ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య జరిగిన గొడవలు రేపు కోర్టులో జరగబోతున్నాయి.
ఇప్పుడు నా ముందు నాలుగు ప్రశ్నలు మిగిలిపోయాయి. నరసింహ శౌర్యను తీసుకెళ్లిపోతే దీప ఇక్కడే ఉంటుందా? ఎక్కడికైనా వెళ్లిపోతుందా? శౌర్య దీప దగ్గర ఉండిపోతే నరసింహ వదిలిపెడతాడా? శౌర్య స్పృహ కోల్పోతేనే తట్టుకోలేని బావ తనని నరసింహకు అప్పగిస్తే ఏం చేస్తాడని అంటుంది.
భలే డౌట్. శౌర్యను కాపాడటం కోసం నేనే తన కన్న తండ్రిని అన్నాడు. రేపు దీపను కాపాడటం కోసం నేనే దీప భర్తను అంటాడని పారిజాతం అనేసరికి జ్యోత్స్న అరుస్తుంది. పోయిన దరిద్రాన్ని నెత్తిన తెచ్చి పెట్టింది నువ్వే నిశ్చితార్థానికి అది ఉండాలని చెప్పావు. అది వచ్చినా నిశ్చితార్థం మాత్రం జరగలేదని అంటుంది.
లాయర్ జ్యోతి ఎంట్రీ
రేపు మనవడు ఆవేశంగా కోర్టులో మాట్లాడకుండా ఉండటం కోసం మనం కోర్టుకు వెళ్తున్నామని పారిజాతం చెప్తుంది. ఈ కేసులో మీ బావ జోక్యం చేసుకోకపోతే తీర్పు నరసింహకు అనుకూలంగా వస్తుందని చెప్తుంది. కోర్టు దగ్గరకు జ్యోత్స్న, పారిజాతం కూడా వస్తారు. వాళ్ళని చూసి మీరు ఎందుకు వచ్చారని కార్తీక్ సీరియస్ అవుతాడు.
నేను దీపకు శ్రేయోభిలాషినే, తన బాధ్యత నాకు కూడా ఉంది. అందుకే కోర్టుకు వచ్చామని జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. దీప తరఫున వాదించేందుకు పాపే మా జీవనజ్యోతి సీరియల్ జ్యోతి ఎంట్రీ ఇస్తుంది. ఇక నరసింహ వైపు వాదించే విష్ణువర్థన్ లాయర్ కూడా జ్యోతి దగ్గరకు వచ్చి పలకరిస్తాడు.
లాయర్లు విష్ణు, జ్యోతి మధ్య కాసేపు వాదం జరుగుతుంది. నరసింహ వాళ్ళు కూడా కోర్టుకు వస్తారు. జ్యోతి వాదనలో చాలా దిట్ట అడిగిన వాటికి తడబడకుండా సమాధానం చెప్పమని తడబడితే దొరికిపోతావని లాయర్ విష్ణు నరసింహకు జాగ్రత్త చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.