Dry brush Uses: నమ్మలేకపోయినా ఇది నిజమే, డ్రై బ్రష్ తో శరీరాన్ని రుద్దుతూ ఉంటే ఈ సమస్యలన్నీ తగ్గుతాయి

Best Web Hosting Provider In India 2024

శరీరానికి సంబంధించి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటిలో చర్మ సమస్యలు కూడా ఒకటి. ఆయుర్వేద రెమెడీల ద్వారా కొన్నింటినీ తగ్గించుకోవచ్చు. అలాంటి సింపుల్ ఆయుర్వేద రెమెడీ… డ్రై బ్రషింగ్. అంటే డ్రై బ్రష్ తో శరీరాన్ని మసాజ్ చేయడం. దీన్ని ఆయుర్వేదంలో ప్రముఖంగా చెప్పుకుంటారు. ఇందులో మృదువైన, పొడి బ్రష్ తో తేలికగా శరీరంపై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై బ్రషింగ్ అందాన్ని పెంచడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కాబట్టి రోజూ స్నానానికి ముందు పదినిమిషాల పాటు డ్రై బ్రష్ తో మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

డ్రై బ్రష్‌తో మసాజ్ చేయడం వల్ల లాభాలు

శోషరస వ్యవస్థ (లింఫ్ నోడ్స్) శరీరాన్ని అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా జలుబు చేసినప్పుడు శోషరస కణుపులు తరచుగా వాపుకు గురవుతాయి. శరీరంపై పొడి బ్రష్‌తో రుద్దడం వల్ల చెమట ద్వారా విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. బ్రష్ రుద్దడం వల్ల చర్మ రంధ్రాలను ఉత్తేజితమవుతాయి. ఇది చెమట బయటికి పోవడానికి సులభతరం చేస్తుంది. డ్రై బ్రష్ మసాజ్ వల్ల శోషరస వ్యవస్థలోని టాక్సిన్స్ తగ్గడం ప్రారంభిస్తాయి.

పొడి బ్రష్ ను శరీరంపై రుద్దడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఇది శరీరంలోని విషాలను తొలగించడం మరింత సులభతరంగా మారుతుంది. ప్రతిరోజూ చర్మంపై పొడి బ్రష్ రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం మరింత మృదువుగా కనిపిస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో కూర్చొని బ్రష్ చేస్తే శరీరం రిలాక్స్ అవుతుంది.

సెల్యులైట్ సమస్యతో బాధపడే మహిళల చర్మంపై పరిశుభ్రంగా ఉండదు. డ్రై బ్రషింగ్ ఈ సమస్యను తగ్గిస్తుంది. బ్రషింగ్ అనేది మహిళల్లో సెల్యులైట్‌పై ప్రభావాన్ని చూపుతున్నప్పటికీ, దాని శాస్త్రీయ కారణం తెలియదు. లైట్ బ్రషింగ్ వల్ల సెల్యులైట్ వంటి లక్షణాలు చర్మంలో కనిపించే సమస్య తొలగిపోతుంది.

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా పొడి బ్రష్ తో శరీరంపై రుద్దడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా మంది ఆయుర్వేద వైద్యులు పొడి బ్రషింగ్ ను సిఫారసు చేస్తారు.

అయితే, డ్రై బ్రషింగ్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. చర్మం చాలా పొడిగా ఉన్నవారు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు డ్రై బ్రష్ వాడడం విషయంలో జాగ్రత్త పడాలి. చర్మానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే డ్రై బ్రష్ చేయడం మర్చిపోకూడదు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024