Ashwin Babu: వాళ్లు నాకు దేవుడితో సమానం.. శివుని ఆజ్ఞ లేనిదే అంటూ హీరో అశ్విన్ బాబు కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Ashwin Babu Shivam Bhaje Success Meet: అశ్విన్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ శివం భజే. డైరెక్టర్ అప్సర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 1న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోందని మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 2న శివం భజే సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అశ్విన్ బాబుతోపాటు ఇతర టెక్నిషియన్స్ ఆసక్తికర విశేషాలు చెప్పారు.

 

నిర్మాత మహేశ్వర రెడ్డి, అప్సర్ గారు ఈ కథను నా వద్దకు తీసుకొచ్చారు. నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నానంటే.. కొత్త పాయింట్ ఉంటుందని అంతా అనుకుంటారు. ఆ మాట నిలబెట్టుకునేందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్‌లకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెబుతున్నారు” అని హీరో అశ్విన్ బాబు తెలిపాడు.

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టుగా.. అన్ని పాత్రలకు అందరూ అద్భుతంగా నటించారు. సాహి సురేష్ గారితో రాజు గారి గది 1, 3 పని చేశాను. ఇప్పుడు మా కాంబోలో శివం భజే వచ్చింది. చోటా డార్లింగ్‌కు రుణపడిపోయాను. శివేంద్ర గారంటే నాకు చాలా ఇష్టం. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో నాకు తెలుసు. ఆయనకు ముందు అడ్వాన్స్ ఇవ్వమని నిర్మాతకు చెప్పాను” అని అశ్విన్ బాబు చెప్పాడు.

“పూర్ణా చారి పాటలు అద్భుతంగా వచ్చాయి. వికాస్ ఇక్కడ లేడు.. లేకపోయినా ఆయన గురించి మాట్లాడుతున్నామంటే అది ఆయన పనితనం. మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ముందు కథ చెప్పినప్పుడు అప్సర్ ఎలా చేస్తారా? అని అనుకున్నాను. కానీ, కామెడీ, యాక్షన్ సీన్‌లకు మంచి అప్లాజ్ వస్తోంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌ను నాకు ఇచ్చినందుకు థాంక్స్” అని అశ్విన్ బాబు అన్నాడు.

 

“నాకు నిర్మాత అంటే దేవుడితో సమానం. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను. నేను ఇంకెన్ని చిత్రాలు చేసినా నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. మంచి కంటెంట్‌తో వస్తే ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్” అని హీరో అశ్విన్ బాబు స్పీచ్ ముగించాడు.

డైరెక్టర్ అప్సర్ మాట్లాడుతూ.. “మా సినిమాను ఆడియెన్స్‌కు దగ్గరగా తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్. నటీనటులంతా అద్భుతంగా నటించారు. ఇక ఇప్పుడు టెక్నికల్ టీం గురించి చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ముందు నుంచి సపోర్ట్‌గా నిలిచారు. వారు నాకెన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. ఎడిటర్ మా సినిమాను చక్కగా ట్రిమ్ చేశారు. ఆయన నాకు అడిషనల్ బ్రెయిన్. టీం అందించిన సహకారంతోనే సినిమా ఇంత బాగా వచ్చింది” అని తెలిపారు.

“శివేంద్ర విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. మంచి కథకు.. మంచి నిర్మాత దొరికారు. పూర్ణా చారి మంచి పాటలిచ్చారు. వికాస్ ఈ సినిమాకు ప్రాణం. ఆర్ఆర్‌తో సినిమాకు ప్రాణం పోశారు. శ్రీనివాస్ రావు గారు, నా డైరెక్షన్ టీం మెంబర్స్ అంతా కూడా చాలా కష్టపడ్డారు. అర్ధరాత్రి దాటినా నా కోసం కష్టపడ్డారు. మా నిర్మాత మహేశ్వర రెడ్డి లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు” అని డైరెక్టర్ అప్సర్ అన్నారు.

 
WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024