Telugu OTT: ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న తెలుగు ఎమోష‌న‌ల్ కామెడీ మూవీ – వంద మిలియ‌న్ల రియ‌ల్ టైమ్ వ్యూస్‌

Best Web Hosting Provider In India 2024


Telugu OTT: ఓటీటీలో చిన్న సినిమా మ‌స్తు షేడ్స్ ఉన్నాయి రా అద‌ర‌గొడుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ వంద‌కుపైగా మిలియన్ల‌ రియల్ టైం వ్యుయింగ్ మినిట్స్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ ఎమోష‌న‌ల్ కామెడీ మూవీలో అభిన‌వ్ గోమ‌టం, వైశాలి రాజ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు.

 

ఎమోష‌న్స్‌కు మించిన టెక్నాల‌జీ…

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా…ఎమోషన్స్‌ని మించిన టెక్నాలజీ మాత్రం అందుబాటులోకి రాలేద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు తిరుప‌తి రావు ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 23న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మార్చి 29న ఓటీటీలోకి వ‌చ్చింది. సొసైటీలో జీవితంలో స్థిర‌ప‌డే క్ర‌మంలో యువ‌త ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌, వారిలో ఉండే క‌న్ఫ్యూజ‌న్స్‌ను రియ‌లిస్టిక్‌గా ఆవిష్క‌రిస్తూ ప్ర‌తి ఒక్క‌రికి రిలేట్ అయ్యేలా ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు.

 

మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా క‌థ ఇదే…

కామెడీకి అంత‌ర్లీనంగా ఓ మెసేజ్‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు తిరుప‌తిరావు మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీని తెర‌కెక్కించాడు. మ‌నోహ‌ర్ అలియాస్ మ‌ను ఓ పెయింట‌ర్‌. పెయింటింగ్ కు అంత‌గా ఆద‌రణ‌ ఆ క‌ళ‌నే న‌మ్ముకొని జీవిస్తుంటాడు. మ‌నుకు ఆదాయం అంతంత మాత్రంగానే కావ‌డంతో పిల్ల‌ను ఇవ్వ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు.

 

ఒక సంబంధం సెటిలైనా పెళ్లికి ముందు రోజే ఆ అమ్మాయి త‌న ప్రియుడిలో లేచిపోతుంది. దాంతో ఊర్లోనే ఫ్లెక్సీ ప్రింటింగ్ బిజినెస్ పెట్టి బాగా డ‌బ్బు సంపాదించాల‌ని మ‌ను అనుకుంటాడు. అప్పు చేసి పెట్టిన ఆ బిజినెస్ మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయింది? ఈ క్ర‌మంలో మ‌ను ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు ఏమిటి? మ‌ను జీవితంలోకి వ‌చ్చిన ఉమాదేవి (వైశాలిరాజ్‌) ఎవ‌రు? ఎప్పుడు త‌న‌ను హేళ‌న చేసే (రాహుల్‌) కు మ‌ను ఎలా బుద్దిచెప్పాడు అన్న‌దే మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ క‌థ‌.

 

నాలుగు కోట్ల క‌లెక్ష‌న్స్‌…

చిన్న సినిమా రిలీజైన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా నాలుగు కోట్ల‌కుపైనే కలెక్షన్స్ ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో అభిన‌వ్ గోమ‌టం మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్‌నే ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసి సినిమాను తెర‌కెక్కించారు. మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీలో నిళ‌ల్‌గ‌ళ్ ర‌వి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

 

మ‌ళ్లీ రావాతో …

మ‌ళ్లీ రావాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు అభిన‌వ్ గోమ‌టం. ఈ సినిమాలో సుమంత్ స్నేహితుడిగా క‌నిపించాడు. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ న‌గ‌రానికి ఏమైంది లో త‌న కామెడీ టైమింగ్‌తో అభిమానుల‌ను న‌వ్వించాడు. క‌మెడియ‌న్‌గా మీకు మాత్ర‌మే చెప్తా, రంగ్‌దే, శ్యామ్ సింగ‌రాయ్‌, విరూపాక్ష‌, మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టితో పాటు చాలా సినిమాలు చేశాడు. అభిన‌వ్ గోమ‌టం హీరోగా న‌టిస్తోన్న మ‌రో మూవీ మై డియ‌ర్ దొంగ ఇటీవ‌లే డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది.

 

మై డియ‌ర్ దొంగ‌…

సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిన‌వ్ గోమ‌టం, భార్య‌పై ఆధార‌ప‌డి బ‌తికే సోమ‌రిపోతు భ‌ర్త‌గా రెండు సీజ‌న్స్‌లో పంచ్ డైలాగ్స్‌తో న‌వ్వించాడు.

 

WhatsApp channel

టాపిక్

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024