Raayan Box Office: రాయన్ కలెక్షన్స్‌లో తేడా- పెరిగిన ప్రాఫిట్- అందుకు కావాల్సింది మరో 4 లక్షలు!

Best Web Hosting Provider In India 2024

Raayan Box Office Collection: హీరోగా స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ఇక తాజాగా తన 50వ సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తాడు ధనుష్. తెలుగులో సైతం మంచి క్రేజ్ సంపాదించుకున్న ధనుష్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

అలాంటి ధనుష్ డైరెక్షన్ చేసిన రాయన్. అయితే ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ సినిమాకు ఫుల్ బజ్ క్రియేట్ కావాల్సింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఆ హైప్ ఎక్కడా కనిపించలేదు.

అంతంతమాత్రంగా

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హైప్ లేకుండానే జూలై 27న విడుదలైంది రాయన్ మూవీ. అయినప్పటికీ రాయన్ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇటీవల 7వ రోజున వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పూర్తి చేసుకున్న ధనుష్ సినిమాకు తెలుగులో మాత్రం కలెక్షన్స్ అంతంతమాత్రంగానే వస్తున్నాయి. కానీ, తమిళంలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది రాయన్ మూవీ.

7.69 శాతం తగ్గిన కలెక్షన్స్

ఈ నేపథ్యంలో రాయన్ సినిమాకు 8వ రోజున ఇండియాలో రూ. 3 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో రూ. 2.58 కోట్లు తమిళం నుంచి రాగా నాలుగు లక్షలు మాత్రమే తెలుగు వెర్షన్‌కు వసూలు అయ్యాయి. ఇక హిందీ బెల్ట్‌లో రూ. 2 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే, ఏడో రోజుతో పోల్చుకుంటే 8వ రోజున రాయన్ మూవీ కలెక్షన్స్ తగ్గాయి. 7.69 శాతం వంటి స్వల్ప తేడాతో రాయన్ కలెక్షన్స్ తగ్గాయి.

గ్లోబల్‌గా 4 కోట్లు

ఇక ఇండియావైడ్‌గా రాయన్ మూవీ 8 రోజుల్లో రూ. 63.1 కోట్లు నికర వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్లలో తమిళం రూ. 53.63 కోట్లు, తెలుగు 8.1 కోట్లు, హిందీ నుంచి 1.36 కోట్లుగా ఉన్నాయి. ఇక 8వ రోజున రాయన్ సినిమా గ్లోబల్‌గా నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో రూ. 110 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు అయింది.

4 కోట్లకుపైగా లాభాలు

7వ రోజున బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినీష్ చేసిన రాయన్ మూవీకి ఇప్పటికీ రూ. 4.15 కోట్ల లాభాలు వచ్చాయి. దాంతో హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాయన్ హిట్ కావాలంటే ఇంకా రూ. 4 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఈ నాలుగు లక్షలు వస్తేనే ఏపీ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ పూర్తి అయి లాభాల బాట పడుతుంది. 9వ రోజు అయిన శనివారం నాడు ఈ టార్గెట్ పూర్తి అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా

అయితే, 9వ రోజున ఇండియాలో రాయన్ సినిమాకు రూ. 2.1 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బుక్ అయిన టికెట్స్ పరంగా చెప్పిన కలెక్షన్స్. రాత్రి షో పూర్తయ్యే సరికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లెక్కలతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024