Happy Friednship Day Wishes: మీ ప్రాణ స్నేహితులకు అందంగా తెలుగులోనే ఇలా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పండి

Best Web Hosting Provider In India 2024


Happy Friednship Day Wishes: ప్రతి ఏడాది ఆగస్టులోని మొదటి ఆదివారం నాడు జాతీయ స్నేహితుల దినోత్సవం వస్తుంది. ఈ రోజున తమకు ఇష్టమైన స్నేహితులు పై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి వీలు కలుగుతుంది. ఈ రోజున ఎన్నో రకాల వస్తువులు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. మీకు ఒక స్నేహితుడు ఉంటే అతనికి తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో లేదా ఎస్ఎంఎస్ రూపంలో కూడా ఈ శుభాకాంక్షలు పంపించవచ్చు

ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు

1. నీ మీద నీకే నమ్మకం లేని సమయాన

నిన్ను నమ్మిన వాడే నీ మిత్రుడు

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

2. స్నేహమంటే భుజం మీద చెయ్యి వేసి

నడవడమే కాదు

నీకు ఎన్ని కష్టాలు వచ్చినా

నీ వెనక నేనున్నా అని చెప్పడం

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

3. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా

తిరిగి ఏకమై సాగే బంధం స్నేహం

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

4. భాష లేనిది

బంధం ఉన్నది

సృష్టిలో అతి మధురమైనది

జీవితంలో మనిషి మరువలేనిది

స్నేహం ఒక్కటే.

స్నేహితుల రోజు శుభాకాంక్షలు

5. ప్రేమను కోల్పోవాల్సి వచ్చినా సరే

కానీ జీవితంలో ఎప్పుడూ స్నేహాన్ని పోగొట్టుకోకూడదు

స్నేహితులు మీతో ఉన్నప్పుడే

జీవితంలో ఆనందం ఉంటుంది

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

6. స్నేహానికి కులం లేదు

స్నేహానికి మతం లేదు

స్నేహానికి హోదా లేదు

స్నేహం బంధుత్వం కంటే గొప్పది

స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు

7. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి

చిన్న మాట చాలు, ఎంత పెద్ద యుద్ధాలనైనా ఆపడానికి

ఒక స్నేహితుడు చాలు జీవితాన్ని మార్చడానికి

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

8. నాకు దేవుడు ఇచ్చిన వరం నీ స్నేహం

అంతులేనిది, అతీతమైనది, స్వార్థం లేనిది నీ స్నేహం

అలాంటి నీ స్నేహం

ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

9. నీ స్నేహం ఒక సుందర స్వప్నం

నీ పరిచయం ఒక సుందరకావ్యం

ఎన్ని జన్మలలో అయినా ఈ స్నేహబంధం

ఇలాగే ఉండాలని కోరుకుంటోంది నా హృదయం

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

10. ఆనందాన్ని పంచేది

అనుబంధాన్ని పెంచేది

మల్లెల కన్నా తెల్లనిది

మంచు కన్నా చల్లనిది

బాధల నుంచి విముక్తి కలిగించేది

మానవ విలువలను తెలిపేది

ఈ ప్రపంచంలో ఎంతో విలువైనది

స్నేహం ఒక్కటే.

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

11. నిన్ను ఆపదలో పెట్టేవాడు కాదు స్నేహితుడంటే,

తన కష్టాన్ని మీ దగ్గర దాచి

మీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా సాయం చేసే వాడే నిజమైన స్నేహితుడు

స్నేహితులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

12. చీకటి పడుతున్న కొద్దీ

మన నీడే మనల్ని వీడిపోతుంది

కానీ స్నేహం మాత్రం

మనతోనే ఉంటుంది

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

13. మరిచే స్నేహాన్ని చేయొద్దు

స్నేహం చేశాక మరవద్దు

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

14. వెలుతురు ఉన్నప్పుడు

ఒంటరిగా నడవడం కంటే

స్నేహితుడితో చీకట్లో నడవడం ఉత్తమం

స్నేహితుల రోజు దినోత్సవ శుభాకాంక్షలు

15. స్నేహితుడు అంటే మీరు చేసిన తప్పులను

మీ ముఖం మీద చెబుతాడు

మీరు విజయం సాధిస్తే ఉప్పొంగి పోతాడు

అలాంటి స్నేహితుడు మీకుంటే

మీరు ఎంతో అదృష్టవంతులు

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

16. మిత్రమా… నీ బాధలన్నీ తీరుస్తానని హామీ ఇవ్వలేను

కానీ ఆ బాధల్లో నేను నీకు తోడుగా ఉంటానని మాత్రం హామీ ఇవ్వగలను

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

17. నీ చిరునవ్వును మాత్రమే గుర్తించే స్నేహితుడు మీకొద్దు

మీ కన్నీళ్ళను కూడా తెలుసుకునే వ్యక్తి మీకు అసలైన మిత్రుడు

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

18. నువ్వు లేకపోతే నేనులేను అనేది ప్రేమ

నీతో పాటు నేను కూడా సంతోషంగా ఉండాలి అనేదే స్నేహం.

అలాంటి స్నేహితుడు మీకుంటే మీరు ఎంతో అదృష్టవంతులు.

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

19. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం వంటిది.

పోగొట్టుకునేంతవరకు దాని విలువ తెలియదు.

మీరు ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

20. అమ్మ ఇచ్చేంది జన్మ

దేవుడు ఇచ్చేది బుద్ధి

గురువు ఇచ్చేది విద్య

ఎవరూ ఇవ్వకుండా దొరికేది స్నేహం

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

21. స్నేహం కోసం మోసం చేసిన తప్పులేదు

కానీ మోసం చేయడానికి కోసం మాత్రం స్నేహం చేయకండి

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

22. స్నేహం విలువ తెలిసిన వారు

ఒక స్నేహితుడు రహస్యాలు…

మరో స్నేహితుడి దగ్గర చెప్పరు.

మీరు ఉత్తమ స్నేహితులగా ఉండాలని కోరుకుంటూ

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

23. స్నేహమంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు

అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు

ఊపిరి ఉన్నంతవరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది

నిజమైన స్నేహం.

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024